అంచనాల ఒత్తిడిలో తమన్ దేవిశ్రీ

సంక్రాంతికి విడుదల కాబోతున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి మొదటి పాటలు వచ్చేశాయి. బాస్ పార్టీ వారం తిరక్కుండానే 14 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుండగా జై బాలయ్య నేనేం తక్కువ తినలేదంటూ నాలుగు రోజులకే 10 మిలియన్లు దాటేసింది. ఫీడ్ బ్యాక్ పరంగా దేవినే పై మెట్టు సాధించాడు. ప్రోమోకు వచ్చిన ట్రోలింగ్ ని తట్టుకుని ఫుల్ సాంగ్ వచ్చాకా ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాడు. ముందు రెగ్యులర్ బీట్ గానే అనిపించినా తర్వాత ఆడియన్స్ కి అందులో రిథమ్ కనెక్ట్ అయిపోవడంతో ఎక్కడ చూసినా ఇదే మారుమ్రోగుతోంది. ముఖ్యంగా డీజే వీరయ్య అంటూ మెగాస్టార్ వేసిన స్టెప్పులు ఊర్వశి రౌతేలా గ్లామర్ రిపీట్స్ వేయిస్తున్నాయి.

ఇక జై బాలయ్యకు మాత్రం తమన్ పూర్తి అంచనాలు అందుకోకపోయాడు. ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్ లా ఉందంటూ వచ్చిన కామెంట్స్ కి ధీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. బ్యాడ్ సాంగ్ కాదు కానీ అఖండలో జైబాలయ్యను మించిన టెంపోని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అది నెరవేరలేదు సరికదా ఇతర అభిమానులు అదే పనిగా వ్యంగ్యాస్త్రాలు విసరడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఫైనల్ గా వినగా వినగా ఇదీ బాగుందే అనిపించవచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం బాస్ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ పోలికలు రావడం సహజం కానీ వాటిని మ్యాచ్ చేసుకుంటూ ప్రమోషన్లు చేయడం మైత్రికి పెద్ద సవాల్ అయ్యింది.

రాబోయే పాటలు ఒకదాన్ని మించి హైప్ ని పెంచేలా చేయడం దేవి తమన్ భుజాల మీదే ఉంది. ఆల్రెడీ కంపోజింగ్ రికార్డింగ్ రెండూ అయిపోయాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఏం చేయలేరు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా బాలన్స్ ఉంది కనక దాని విషయంలో బెస్ట్ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. పైన బాస్ పార్టీ ఎంత హిట్ అయినా దేవి లెవల్ లో లేదనే విమర్శలు లేకపోలేదు. ఇంకా విడుదల తేదీ నిర్ణయం కాలేని వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఏరియాల వారిగా బిజినెస్ డీల్స్ అయితే మొదలైపోయాయి. బయ్యర్లు క్రేజీగా కొనేస్తున్నారు. వారసుడు పోటీ థియేటర్ల పరంగా తీవ్రంగా ఉన్నప్పటికీ టాక్ వస్తే చిరు బాలయ్యలు దున్నేస్తారు

Show comments