iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2.. ఫస్ట్ ఆఫ్ అదుర్స్! సుక్కు ఫ్యాన్స్ ని ఛీట్ చేస్తున్నాడా?

  • Published Oct 15, 2024 | 6:09 PM Updated Updated Oct 15, 2024 | 6:09 PM

Sukumar Crazy Plan Behind Pushpa 2 Promotions: పుష్పరాజ్ రూల్ కోసం అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 విషయంలో సుకుమార్ ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నాడు అంటున్నారు.

Sukumar Crazy Plan Behind Pushpa 2 Promotions: పుష్పరాజ్ రూల్ కోసం అతని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 2 విషయంలో సుకుమార్ ఫ్యాన్స్ ని మోసం చేస్తున్నాడు అంటున్నారు.

  • Published Oct 15, 2024 | 6:09 PMUpdated Oct 15, 2024 | 6:09 PM
Pushpa 2: పుష్ప 2.. ఫస్ట్ ఆఫ్ అదుర్స్! సుక్కు ఫ్యాన్స్ ని ఛీట్ చేస్తున్నాడా?

ఇండియా మొత్తం ఇప్పుడు పుష్పరాజ్ రూల్ కోసం ఎదురుచూస్తోంది. మూవీ లవర్స్ మీద పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ వస్తాడా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన పుష్ప మేకింగ్ డిలే వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. డిసెంబర్ 6న మాత్రం ఆగేదేలే.. అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా పుష్ప 2 సినిమా కోసం అందరూ వెయిటింగ్. అలాంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ గురించి చాలానే ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ వచ్చాయి. ఇండియా వైడ్ గా వాటికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నెటిజన్స్ ఈ పాటలను రీల్స్ చేసి హోరెత్తించారు. అయితే ఇప్పటి వరకు డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమా విషయంలో ప్రేక్షకులను ఛీట్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటి.. సుకుమార్ ఆడియన్స్ ని మోసం చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఆ లెక్క ఏంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ దేశవ్యాప్తంగా సంచలనాలే సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు అల్లు అర్జున్ మీదే కాదు.. సుకుమార్ మీద కూడా బాధ్యత పెరిగింది. అంతటి భారీ అంచనాలు నెలకొన్న చిత్రం విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకూడదు. అలాంటి పక్కా ప్రణాళికతోనే సుక్కు వస్తున్నాడు అంటున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసేసినట్లు చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పటివరకు మూవీ అప్ డేట్స్ వచ్చాయి అంటున్నారు. మొదటి పార్ట్ మొత్తం పుష్ప ఎలా ఎదిగాడు అనేది చూపించారు. అందుకే ఆ పార్ట్ కి సంబంధించి ‘రైజ్’ అనే ట్యాగ్ పెట్టారు.

ఇప్పుడు రెండో పార్ట్ లో పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారు. అందుకే ఈ పార్ట్ కి ది రూల్ అని ట్యాగ్ పెట్టారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన అప్ డేట్స్ లో ఎక్కడా కూడా పుష్పరాజ్ రూల్ కి సంబంధించిన హింట్స్ ఇవ్వలేదు. కానీ, తాజాగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప 2 సినిమాకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. అదేంటంటే.. పుష్ప 2 మూవీ ఫస్ట్ పార్ట్ అదిరిపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు అంతా ఫస్ట్ పార్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే మనకు మొదటి పార్ట్ కి సంబంధించి ఎలాంటి క్లూస్ సుక్కు ఇవ్వడం లేదు. మొదట్లో వదిలిన టీజర్ చూస్తే.. పుష్పరాజ్ ఎక్కడ? అంటూ ప్రశ్నను లేవనెత్తారు. పుష్పరాజ్ అడవిలోకి పారిపోయాడు అని చూపించారు. అతని కోసం అందరూ వెతుకుతూ ఉంటారు.

రెండో టీజర్ లో గంగమ్మ గెటప్ లో చూపించారు. కానీ, పుష్ప రాజ్ రూల్ కి సంబంధించి ఎలాంటి హింట్స్ ఇవ్వడంలేదు. ఈ విషయంలోనే సుకుమార్ ఫ్యాన్స్ ని మోసం చేశాడు అంటున్నారు. ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఎలాంటి లీడ్స్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాడ అని తెలుస్తోంది. మొదటి భాగంలో కథ కావచ్చు, పుష్పరాజ్ రూల్ కావచ్చు.. నేరుగా వెండితెర మీద చూపిస్తాడని చెబుతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకే సుక్కు ఇలాంటి స్ట్రాటజీ వాడుతున్నాడు అనిపిస్తోంది. మరి.. నిజంగానే ఫస్ట్ పార్ట్ నుంచి సుక్కు ఎలాంటి లీడ్స్ ఇవ్వడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet