iDreamPost
iDreamPost
కరోనా సెగలు కార్పిచ్చులా టాలీవుడ్ ను అంటుకుంటూనే ఉన్నాయి. ఏదో ఒక వారం పది రోజుల్లో సద్దుమణుగుతుందనుకుంటే మోడీ స్పీచ్ విన్నాక కనీసం నెల రోజులు తప్పదని ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క వాయిదా ప్రకటనలు బయటికి వచ్చేస్తున్నాయి. అఫీషియల్ గా చెప్పినా చెప్పకపోయినా ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో షెడ్యూల్ చేసిన కొత్త సినిమాలు విడుదల చేయడం ఇప్పుడు చాలా రిస్క్. జనం భయాందోనళలు తగ్గలేదు సరికదా ఇంకా పెరిగాయి.
సో ఇప్పుడు తొందరపడి డేట్ ప్రకటించడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ . ఇదిలా ఉండగా మెగా మేనల్లుడు 2, సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ఉప్పెన ఇంకో నెల వాయిదాను ప్లాన్ చేసుకున్నట్టు ట్రేడ్ నుంచి అందుతున్న అప్ డేట్. ప్రస్తుతం దర్శక నిర్మాతల మధ్య దీని గురించిన చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ వాళ్ల మనసులో ఉన్నది కనక అమలు చేస్తే ఉప్పెన మే 7న వస్తుంది. ఈ డేట్ కు ఒక ప్రత్యేకత ఉంది. అల్లు అర్జున్ కి స్టార్ స్టేటస్ ఇచ్చి డెబ్యుతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన సుకుమార్ మొదటి సినిమా ఆర్య విడుదల తేది ఇది.
వన్ సైడ్ లవర్ గా అల్లు అర్జున్ తో సుక్కు చేయించిన ఈ మ్యూజికల్ లవ్ జర్నీకి యూత్ ఫిదా అయిపోయింది. సెంటిమెంట్ పరంగానూ ఇదే బెస్ట్ డేట్ అని ఫీలవుతున్నారట. ఎందుకంటే ఉప్పెన సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో రూపొందింది. దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడే. ఇలా అన్ని కోణాల్లో మే 7 బెస్ట్ డేట్ గా ఫీలవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన రావడానికి కొంత టైం పట్టినా ఏప్రిల్ 2 ఉప్పెన వచ్చే ఛాన్స్ లేదన్నది మాత్రం నిజం. ఇక్కడ మరో విశేషం ఉంది. అప్పుడు ఆర్యకు ఇప్పుడు ఉప్పెనకు సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చింది ఒక్కరే. దేవి శ్రీ ప్రసాద్. సో ఇక అన్ని అనుమానాలు తీరిపోయినట్టే కదా.