iDreamPost
android-app
ios-app

సజ్జల చెప్పిన 17 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలే ఆ నలుగురు ఎవరు..?

సజ్జల చెప్పిన 17 మంది ఎమ్మెల్యేలు.. టీడీపీలో మిగిలే ఆ నలుగురు ఎవరు..?

రాజకీయ ప్రయాణంలో తెలగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా..? 2019 ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీని మరింతగా దిగజారుస్తున్నాయా..? టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న విధానాలే ఆ పార్టీకి సంకటంగా మారాయా..? ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారా..? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న ఆదివారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఇప్పటికే మండలి వ్యవహారంతో కుదేలైన టీడీపీ శ్రేణులకు సజ్జల వ్యాఖ్యాలు మరింత ఆందోళన పెంచాయి.

ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే మొదటగా ఆ పార్టీ కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎంను కలిశారు. అప్పటి నుంచి వారిద్దరూ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు, గొట్టిపాటి రవికుమార్, కరణం బలరామకృష్ణమూర్తి ఇలా పలువరు

ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా 17 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పడం రాజకీయ వ్యూహంలో భాగమనే కోణంతో చూడలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉంటేనే తప్పా సజ్జల ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరంటున్నారు. అందుకు ఎన్నికలు మగిసిన తర్వాత నుంచి ఇటీవల జరిగిన పరిణామాలు, అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును వారు విశ్లేషిస్తున్నారు.

ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలలో అచ్చెన్నాయుడు, రామానాయుడు తప్పా మరెవరూ ఆ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడంలేదు. అసెంబ్లీలో కూడా చంద్రబాబుకు మద్దతుగా రామానాయుడు, అచ్చెన్నాయుడులు మినహా మరెవరూ పెద్దగా స్పందించడంలేదు. విలేకర్ల సమావేశాల్లో కూడా వీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు.

23 మంది ఎమ్మెల్యేలకు గాను ఇద్దరు జారిపోగా ప్రస్తుతం టీడీపీకి చంద్రబాబుతో సహా 21 మంది మిగిలారు. సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధగా ఉన్నారనడంతో.. వారు ఎవరా..? అన్న చర్చ మొదలైంది. 17 మంది ఎవరు..? అనేదానికంటే.. మిగిలే నలుగురు ఎవరు..? అనేది తేల్చితే సరిపోతుందని విశ్లేషకులు అంచనాలు వేసుకుంటున్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రామా నాయుడులతో పాటు టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ.. వెరసి ఐదుగురితో విశ్లేషకులు ఒక జాబితా సిద్ధం చేశారు. ఐతే 21 మందిలో 17 పోను మిగిలేది నలుగురే. చంద్రబాబు, బాలకృష్ణ మినహా మిగిలే ఆ ఇద్దరు ఎవరు..? రాజకీయ జీవితంలో చివరి దశలో ఉన్న బుచ్చయ్య పార్టీ మారే పరిస్థితి ఉండదు. ఇక పొతే రామానాయుడు, అచ్చెన్నాయుడు మిగులుతారు. చంద్రబాబు మద్దతుగా ఉన్న వీరిలో ఎవరు వైఎస్సార్ సిపి లో చేరేందుకు మంతనాలు జరిపారన్నది చర్చనీయాంశమవుతోంది. టీడీపీ లో మిగిలే ఆ నాలుగో ఎమ్మెల్యే రామనాయుడా..? లేదా అచ్చెన్నాయుడా..? ఎవరు..?.