Idream media
Idream media
రాజధాని విభజన , విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి అంశాలమీద చట్టపరంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర చర్చకు ఆస్కారం ఇచ్చేలా చూస్తూనే అసెంబ్లీ ముట్టడికి మరోవైపు టిడిపి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అమరావతి, గుంటూరు,విజయవాడల్లోని కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయి. ఇదిలా ఉండగా రేపటి అసెంబ్లీ సమావేశాల్లో పై చేయి సాధించే విషయం,వ్యూహాలు ఎలా అమలు చేయలన్నదానిపై చర్చించేందుకు ఆదివారం టీడీఎల్పీ భేటి జరిగింది.
23 ఎమ్మెల్యేలకుగాను ఇప్పటికే వల్లభనేని వంశీ టిడిపి నుంచి జారుకోగా మరికొందరు ఎమ్మల్యేలు బాబుకు సవాల్ విసురుతూ ఎప్పుడు బయటకు వెళ్లిపోతారా అన్నట్లుగా ఉన్నారు. ఆదివారం జరిగిన కీలక భేటీకి ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం బాబును హతాసుణ్ణి చేసింది. గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, ఆదిరెడ్డి భవాని, అశోక్, అనగాని సత్యప్రసాద్ ఈ భేటీకి రాలేదు. వీరు రేపు అసెంబ్లీ సమావేశానికి అయినా వస్తారో రారోనన్న అనుమానాలున్నాయి. కీలకమైన సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీఎల్పీ భేటి కి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.