Idream media
Idream media
హిందువుల మనోభావాలు దెబ్బతినకముందే, వారిలో ఆందోళన రాకముందే శ్రీవారి ఆస్తుల వేలంను నిలిపివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి స్వామి పరిపూర్ణానంద కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.
ఇప్పటి వరకూ పని చేసిన ముఖ్యమంత్రులు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టింది ఏమీ లేదని పరిపూర్ణానంద ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ పాలకుల నిర్వాకం వల్ల దేవుళ్లకు చెందిన ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. లెక్కలేనన్ని ఆభరణాలు దోపిడీకి గురయ్యాయని పరిపూర్ణానంద అన్నారు. తాను చెప్పేవి సత్యమన్నారు.
అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేవాలయాల ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. ప్రజలు అందించిన ఆస్తుల వివరాలు వారికి తెలియజేయడంలో తప్పులేదన్నారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని ఈ పనిని జగన్ చేస్తే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అంతేకాకుండా నమ్మి ఓట్లు వేసిన హిందువులకు న్యాయం చేసిన వారవుతారన్నారు.