iDreamPost
android-app
ios-app

వాయిదాలతో మండలిలో కొనసాగుతున్న ఉత్కంఠ

వాయిదాలతో మండలిలో కొనసాగుతున్న ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, ఏపీసీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ రోజు మండలి సమావేశాలకు చివరి రోజు కావడంతో ఈ బిల్లులను అడ్డుకోవాలని టీడీపీ, ఎలాగైనా పాస్‌ చేయించుకోవాలని అధికార వైఎస్సార్‌సీపీ పట్టుదలతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని లేదా ఓటింగ్‌ నిర్వహించాలని ప్రతిపక్ష టీడీపీ పట్టుబడుతోంది. బిల్లులు ఇప్పటికే మండలిలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో సెలక్ట్‌కమిటీ అనే అంశమే ఇక్కడ రాదని అధికార పార్టీ స్పష్టం చేస్తోంది.

అయితే ఓటింగ్‌ జరపాలని టీడీపీ శాసనమండలి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేస్తున్నారు. సభలో 22 మంది మంత్రులున్నారని, వారిలో బిల్లులు ప్రవేశపెట్టిన బొత్సా సత్యనారాయణ, సభలో సభ్యులైన మరో ఇద్దరు మంత్రులు మినహా మిగతా వారందరినీ బయటకు పంపి ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాసన మండలి పలుమార్లు వాయిదా పడింది. అంతకు ముందు రాజధాని అమరాతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వాడీ వేడీ చర్చ సాగింది.