Wanted Pandugod వాంటెడ్ పండుగాడ్ రిపోర్ట్

వాంటెడ్ పండుగాడ్ తో రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో టీమ్ అలాంటి సాహసమే చేసింది.

వాంటెడ్ పండుగాడ్ తో రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో టీమ్ అలాంటి సాహసమే చేసింది.

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, బింబిసార, సీతారామం, కార్తికేయ 2 లాంటి గ్రాండియర్లను మాత్రమే ఎగబడి థియేటర్లలో చూస్తున్న ట్రెండ్ లో కేవలం హాస్య నటులతో ఓ సినిమా తీయడమంటే సాహసమే. వాంటెడ్ పండుగాడ్ తో రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణలో టీమ్ అలాంటి సాహసమే చేసింది. ఇది ఎప్పుడు తీశారో ఎప్పుడు పూర్తయ్యిందో తెలియదు కానీ ఓ నెల రోజుల నుంచి ప్రమోషన్లు తెగ హడావిడిగా చేస్తున్నారు. టీవీ జబర్దస్త్ ఆర్టిస్టులు ఎక్కువగా కనిపించిన ఈ ఎంటర్ టైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే దర్శకేంద్రులు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

 

జైలు నుంచి పారిపోయిన పండుగాడు(సునీల్)ని పట్టుకుని తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తామని అవార్డు ప్రకటిస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్. దీంతో పాండు(సుధీర్)తో పాటు మరో లేడీ రిపోర్టర్(దీపికా పిల్లి)అతన్ని వెతికేందుకు బరిలో దిగుతారు. వీళ్ళు కాకుండా ఎవరెవరో చెట్లు పుట్టలు అడవులు పట్టుకుని పండుగాడు కోసం వేట మొదలుపెడతారు. ఇంతకీ పండుగాడి కోసం ఇంత అన్వేషణ ఎందుకు జరిగింది, చివరికి ఎవరు విన్ అయ్యారనేదే స్టోరీ. దర్శకుడు శ్రీధర్ సీపాన కామెడీ టైమింగ్ పెళ్లి సందడిలో నచ్చే ఈ అవకాశం ఇచ్చానని సమర్పకులు కం పర్యవేక్షకులు రాఘవేంద్రరావు సెలవిచ్చారు కానీ అసలు అంతగా ఏం నచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాదు.

ఇది జబర్దస్త్ జమానా.యుట్యూబ్, ఫేస్ బుక్ లో ఆ కామెడీ షోకు సంబంధించిన లక్షలాది వీడియోలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ వాళ్లనే తీసుకొచ్చి అవే తరహా స్కిట్లను థియేటర్ కొచ్చి డబ్బులిచ్చి చూడమంటే ఎలా. ఈ వాంటెడ్ పండుగాడ్ లో జరిగింది అదే. ఇదేం హాస్యంరా బాబు అనిపించేలా ప్రతి ఫ్రేమ్ ని వీలైనంత చికాకొచ్చేలా తీర్చిదిద్దారు. దానికి తోడు ఆర్టిస్టులు తెరనిండుగా ఉన్నా అవుట్ డేటెడ్ కంటెంట్ తో సహనానికి గట్టి పరీక్ష పెడుతుంది. సీనియర్ నుంచి జూనియర్ దాకా అందరూ ఉంటారు కానీ అసలైన విషయమే తక్కువగా ఉంది. ఎలా ఉన్నా పర్లేదు టీవీ షోనే మళ్ళీ స్క్రీన్ మీద చూస్తామనే వాళ్లకు తప్ప వాంటెడ్ పండుగాడ్ ఛాయస్ గా పెట్టుకోలేం

Show comments