iDreamPost
android-app
ios-app

వీడియో: మోత మోగించిన సుధీర్.. ఈ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ అంటే..!

  • Published Jul 29, 2024 | 8:33 PM Updated Updated Jul 29, 2024 | 8:33 PM

Sudigali Sudheer Sarkar Season 4 Success Party Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్ గా సర్కార్ సీజన్ 4 నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్ ట్రెండింగ్ లో నిలిచింది. అందుకే అందరినీ పిలిచి సుధీర్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

Sudigali Sudheer Sarkar Season 4 Success Party Promo: సుడిగాలి సుధీర్ హోస్ట్ గా సర్కార్ సీజన్ 4 నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్ ట్రెండింగ్ లో నిలిచింది. అందుకే అందరినీ పిలిచి సుధీర్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

  • Published Jul 29, 2024 | 8:33 PMUpdated Jul 29, 2024 | 8:33 PM
వీడియో: మోత మోగించిన సుధీర్.. ఈ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ అంటే..!

సుడిగాలి సుధీర్.. బుల్లితెరలో ఈ పేరు ఒక సంచలనం. బుల్లితెర మెగాస్టార్ అని బిరుదును మాత్రమే కాకుండా ప్రేక్షకుల అభిమానాన్ని కూడా పొందాడు. సుధీర్ అటు హీరోగా కూడా అభిమానులను అలరిస్తున్నాడు. అయితే ఎంతైనా సుధీర్ ని బుల్లితెరలో మిస్ అవుతున్నాం అనే అసంతృప్తి అయితే ప్రేక్షకుల్లో ఉంది. అందుకే సర్కార్ సీజన్ 4కి హోస్ట్ గా మారాడు. జస్ట్ హోస్ట్ గా మాత్రమే కాకుండా.. సర్కార్ సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంలో సుధీర్ కృషి కూడా చాలా ఉంది. ప్రతి ఎపిసోడ్ ట్రెండింగ్ లో నిలవడానికి సుధీర్ కూడా కారణం అని చెప్పచ్చు. సీజన్ ఇంత బాగా సక్సెస్ అయినందుకు అందరినీ పిలిచి సక్సెస్ పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించి ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

సర్కార్ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ అయ్యిందని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీజన్ ఎపిసోడ్స్ అన్నీ ఎంత ట్రెండింగ్ లోకి వచ్చాయో ఓటీటీ ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాంటి సీజన్ సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సీజన్ లో పాల్గొన్న అందరినీ ఆహ్వానించారు. సీజన్ మొత్తంలో కనిపించిన కంటెస్టెంట్స్ అందరూ కలిసి మరోసారి మెగా ఎపిసోడ్ లో తలపడ్డారు. అయితే ఈసారి కేవలం మాటలు, ఆటలు మాత్రమే కాకుండా.. డ్యాన్సులతో స్టేజ్ ని ఊపేశారు. అటు పంచులకు అయితే లెక్కేలేదు. ఇప్పటివరకు జరిగిన కొన్ని సీన్స్ ని మధ్యలో రీక్రియేట్ చేస్తూ వచ్చారు.

Sudheer

ముఖ్యంగా ఈ ప్రోమోలో డ్యాన్సులు మాత్రం బాగా హైలెట్ అని చెప్పాలి. అమర్ దీప్- సుబ్బు కలిసి మోత మోగిపోద్ది సాంగ్ కు స్టేజ్ ని మోత మోగించేశారు. యాదమ్మ రాజు- వర్షా కలిసి అదిరిపోయే నంబర్ కు స్టెప్పులేశారు. ఇంక సుధీర్ కూడా కాలు కదపడంతో ప్రోమో నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోయింది. జాతిరత్నాల్లో చిట్టి నీ నవ్వంటే సాంగ్ కు సుధీర్ వేసిన క్లాసీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంక శ్రీహాన్- సిరి హన్మంతు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా అలరిస్తుంది. ఇంక పూర్తి ఎపిసోడ్ వస్తే ఓటీటీలో ఇదే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆగస్టు 2న ఈ సర్కార్ సీజన్ 4 సక్సెస్ పార్టీ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి.. ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom