iDreamPost
android-app
ios-app

వీడియో: సుధీర్ షోలో RRR సింగర్ తండ్రి ఎమోషనల్.. ఎవరూ లేరు అంటూ..!

  • Published Jun 19, 2024 | 9:22 PMUpdated Jun 19, 2024 | 9:22 PM

బుల్లితెర స్టార్ కమెడియన్ సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. కాగా, ఆ ప్రోమోలో ఆర్ ఆర్ ఆర్ సింగర్ తండ్రి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు.

బుల్లితెర స్టార్ కమెడియన్ సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. కాగా, ఆ ప్రోమోలో ఆర్ ఆర్ ఆర్ సింగర్ తండ్రి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు.

  • Published Jun 19, 2024 | 9:22 PMUpdated Jun 19, 2024 | 9:22 PM
వీడియో: సుధీర్ షోలో RRR సింగర్ తండ్రి ఎమోషనల్.. ఎవరూ లేరు అంటూ..!

సుడిగాలి సుధీర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే.. ఇటువంటి సినీ బ్యాక్ డ్రాప్ లేకుండా.. కేవలం ఒక మెజీషియన్ గా తన కెరీర్ ప్రారంభించి నేడు ఒక స్టార్ సెలబ్రిటీగా మారాడు. అయితే మొదటగా ఈయన బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి అక్కడ జబర్ధస్త్ షో ద్వారా తనదైన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే.. పలు టీవీ షోలలో కూడా అలరించి మంచి స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. అయితే కామెడియన్ గా మాత్రమే కాకుండా..యాకంర్ గా సింగర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్ సుధీర్ కు హీరో అయ్యే క్వాలిటీస్ ఉండటంతో.. రాను రాను సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో అలరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బుల్లితెర పై సుధీర్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అ్యయింది.  అయితే ఆ ప్రోమోలో  ఆర్ఆర్ఆర్ సినిమా సింగర్  తండ్రి ఎమోషనల్ అవతూ కంటతడి పెట్టారు. ఇంతకి ఏం జరిగిందంటే..

ప్రస్తుతం సుధీర్  యాంకర్ గా హోస్ట్ చేస్తున్న షోలలో ఫ్యామిలీ స్టార్ షో కూడా ఒకటి. అయితే ఈ షోలో సరదాగా సాగే లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. కాగా, ఆ ప్రోమోలో కమెడియన్ రియాజ్, భానుశ్రీ, యాంకర్ స్రవంతి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్రవంతి, భానుశ్రీ ఇద్దరూ సుధీర్ ఫోటో పట్టుకుని రియాజ్ వద్దకు వెళుతారు. ఇక అక్కడ బావకి ఏమంటే ఇష్టం అని అడుగుతారు. దీనికి రియాజ్ పులిహోర అంటే ఇష్టం అని చెప్పి నవ్వులు పూయిస్తాడు. ఇలా రియాజ్ సుడిగాలి సుధీర్, స్రవంతి, భానుశ్రీ మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.  అంతేకాకుండా వారి చేసిన పెర్ఫామ్ స్కిట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఇకపోతే ఈ షోలో వారితో పాటు కొందరు బాల గాయకులని కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ ప్రోమెలో ఓ ఎమోషనల సంఘటన చోటు చేసుకుంటుంది. కాగా, ఈ షోకి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎంతో తీయగా కొమ్మా ఉయ్యాలా అనే సాంగ్ పాడిన చిన్నారి ప్రకృతి కూడా హాజరైంది. ఇక ఆ షోకు ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఆ షోలో సింగర్ ప్రకృతి తండ్రి కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే.. ప్రకృతి తండ్రి ఓ సాధారణ రైతు. అయినప్పటికి తన  కుమార్తెని సింగర్ ని చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాట పాడేలా చేశారు అంటూ సుధీర్ ఆయనను  అభినందించారు. ఇక  సుధీర్ మాటలకు ప్రకృతి తండ్రి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాకు  ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. కానీ, మా ప్రకృతి ఇంత గుర్తింపు తెచుకున్నందుకు నాకు  చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో కీరవాణి కూడా చిన్నారి ప్రకృతి గాత్రాన్ని అభినందించారు. మరి, ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి