SS Rajamouli : నేషనల్ లెవెల్ లో రాజమౌళి మాస్టర్ ప్లాన్

నిన్న ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ వేడుకకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్టార్ ఛానల్ ఈ ప్రోగ్రాం హక్కులు సొంతం చేసుకుంది. కాకపోతే లైవ్ లో ఇవ్వకుండా న్యూ ఇయర్ సందర్భంగా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 3 వేల అభిమానులు దీని కోసం ప్రత్యేకంగా బస్సులు రైళ్లలో అక్కడికి చేరుకున్నారు. స్ట్రీమింగ్ లేనప్పటికీ ఫ్యాన్స్ తమ మొబైల్ ఫోన్స్ లో షూట్ చేసిన వీడియోలు స్పీచులు బయటికి వచ్చాయి. ఆర్ఆర్ఆర్ యూనిట్ అఫీషియల్ గా ట్విటర్ హ్యాండిల్ లో ఫోటోలను పెట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తమ స్నేహాన్ని చాటుతూ మాట్లాడిన విధానం అక్కడికి వచ్చిన ప్రతిఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య బాండింగ్ బాలీవుడ్ మీడియాకు సైతం అర్థమైపోయింది. స్నేహానికి మించిన బంధం వీళ్ళకు ఉందనే దాని పట్ల వాళ్ళూ ఆశ్చర్యపోయారు. కరణ్ జోహార్ ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించగా హీరోయిన్ అలియా భట్ తో పాటు శ్రేయ తదితరులు హాజరయ్యారు. కాల్ షీట్ సమస్య కారణంగా అజయ్ దేవగన్ ఈ ఈవెంట్ కు రాలేకపోయాడు. అయినా సల్మాన్ ఉండగా ఇంకే గెస్టులు అవసరం లేదు కాబట్టి రాజమౌళి ప్లాన్ చేసుకున్న ఈ గ్రాండ్ స్కేల్ ప్రమోషన్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

ఇచ్చిపుచ్చుకునే ఒప్పందంలో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో పాల్గొనబోతోందని సమాచారం. క్యాస్టింగ్ మొత్తం వెళ్లి అందులో పాల్గొనడం ద్వారా రీచ్ ఇంకా భారీగా పెరగనుంది. రాబోయే 16 రోజుల పాటు నాన్ స్టాప్ గా తమ సినిమా గురించి మాత్రమే చర్చ జరిగేలా జక్కన్న బృందం సర్వం సిద్ధం చేసుకుని ఉంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఓపెనింగ్స్ చాలా కీలకం కాబట్టి అక్కడ గట్టి దృష్టి పెడుతోంది. మిక్స్డ్ టాక్ తోనే పుష్ప మంచి వసూళ్లు దక్కించుకున్న నేపథ్యంలో ఇక ఆర్ఆర్ఆర్ అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. అందుకే రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు

Also Read : Acharya : విడుదల తేదీ వాయిదా ప్రచారం – అసలు నిజం

Show comments