iDreamPost
android-app
ios-app

క్యాబినెట్ లో కూడా సోషల్ డిస్టెన్స్

క్యాబినెట్ లో కూడా సోషల్ డిస్టెన్స్

దేశంలో కరోనా విస్తరిస్తున్న కారణంగా ప్రధానమంత్రి మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.. కరోనా అంటువ్యాధి కాబట్టి ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం బాగా తక్కువని ప్రజలు గుంపులుగా ఉండకుండా కాస్త దూరంగా ఉండాలని ఇంటికే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

కాగా తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ డిస్టెన్స్ పాటించి, సోషల్ డిస్టెన్స్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తూ సోషల్ డిస్టెన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ప్రస్తుతానికి మన దేశంలో రెండో దశలో ఉంది. ఒకవేళ అది మూడో దశకి చేరితే మన దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కష్టమని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. మూడో దశలోకి చేరకుండా ఉండాలి అంటే హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్య నిపుణులు సూచించారు. ఆ సూచనలను నాయకులు పాటిస్తూ క్యాబినెట్ లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడంతో నాయకులను ఆదర్శంగా తీసుకుని ప్రజలు కూడా అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలని అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని పలువురు చెబుతున్నారు.

ఇప్పటికే రైతు బజార్ల దగ్గర ప్రజలు గుమిగూడకుండా సోషల్ డిస్టెన్స్ పాటించేలా జగన్ సర్కారు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏది ఏమైనా రూల్స్ ఉన్నవి ప్రజలకే కాదు నాయకులకు కూడా అన్న సత్యాన్ని నిజం చేస్తూ నాయకులు క్యాబినెట్ లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అందరికి ఆదర్శంగా నిలిచి వార్తల్లో నిలిచారు.