Shyam Singha Roy : వారాంతంలో న్యాచురల్ స్టార్ హవా

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ కలెక్షన్లు మొదటి మూడు రోజులు అదిరిపోయాయి. వీకెండ్ ని పూర్తిగా వాడుకుంటూ మంచి వసూళ్లు దక్కాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి ఫిగర్స్ నమోదు కావడం విశేషమే. టాక్ మరీ అత్యద్భుతం అని రాకపోయినా నాని పెర్ఫార్మన్స్, కోల్కతా బ్యాక్ డ్రాప్, సాయి పల్లవి పాత్ర లాంటి అంశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొస్తున్నాయి. యూత్ ని ఆకట్టుకునే పని ఎలాగూ కృతి శెట్టి చేసింది. ఈ రోజు సోమవారం నుంచి మరీ తీవ్రంగా డ్రాప్ లేకపోవడం ఊరట కలిగించే అంశం. కాకపోతే ఈ స్టడీనెస్ ని ఎన్ని రోజులు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. జనవరి 7 దాకా చెప్పుకోదగ్గ పోటీ లేదు.

ట్రేడ్ నుంచి అందిన అనధికార సమాచారం మేరకు శ్యామ్ సింగ రాయ్ మొదటి మూడు రోజులకు గాను 17 కోట్ల దాకా షేర్ రాబట్టినట్టు చెబుతున్నారు. అంటే గ్రాస్ రూపంలో చూసుకుంటే సుమారుగా 30 కోట్ల పైచిలుకు దాకా తేలుతుంది. ఇది ఒకరకంగా నాని కెరీర్ బెస్ట్ ని చెప్పొచ్చు. ఫుల్ రన్ లో భలే భలే మగాడివోయ్, ఎంసిఏలను క్రాస్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇంకో పది రోజుల దాకా బాక్సాఫీస్ దగ్గర ఉన్న స్పేస్ ని వాడుకోవడానికి శ్యామ్ సింగ రాయ్ కి ఇదే మంచి ఛాన్స్. వీకెండ్స్ లో ఇరవై రోజుల క్రితం వచ్చిన అఖండనే ఫుల్ అవ్వగా లేనిది ఇదే తరహా రెస్పాన్స్ ని కనక నాని సినిమా కొనసాగిస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటుకోవచ్చు.

నైజామ్ నుంచి అత్యధికంగా 6 కోట్ల 15 లక్షల షేర్ రాగా, సీడెడ్ 2 కోట్లకు దగ్గరలో ఉంది. ఉత్తరాంధ్ర 1 కోటి 39 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 1 కోటి 10 లక్షలు, గుంటూరు 76 లక్షలు, కృష్ణా 55 లక్షలు, నెల్లూరు 36 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 2 కోట్ల 30 లక్షలు, ఓవర్సీస్ 2 కోట్ల 83 లక్షల దాకా వచ్చినట్టు తెలిసింది. బ్రేక్ ఈవెన్ 22 కోట్లు ఎంతో దూరంలో లేదు. చాలా ఈజీగానే చేరుకోవచ్చు. ఈ వారం అర్జునా ఫల్గుణ ఎంత మేరా ప్రభావం చూపిస్తుందో అనుమానమే. అది కాకుండా హైప్ ఉన్నవి పెద్దగా లేవు. ఇంకో ఆరు కోట్లను రాబట్టుకోవడం దుర్లభం కాదు కానీ అసాధ్యం అయితే కాదు. మరి ఇయర్ ఎండింగ్ ని నాని బ్లాక్ బస్టర్ తో ముగిస్తాడేమో చూడాలి.

Also Read : Good Luck Sakhi : కీర్తి సురేష్ మూవీకి మోక్షం ఎప్పుడు

Show comments