Narasimha : బుల్లితెరను షేక్ చేసిన నరసింహ

ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ లో కొత్త సినిమాలకు పెద్ద రేటింగ్ రావడమే గగనం. అలాంటిది 22 ఏళ్ళ క్రితం వచ్చిన మూవీకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని మించిన రెస్పాన్స్ వస్తే ఎలా ఉంటుంది. అది ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో. ఇటీవలే సన్ టీవీలో నరసింహ తమిళ వెర్షన్ పడయప్పాను టెలికాస్ట్ చేశారు. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. ఇది ఏడేళ్ల తర్వాత అక్కడి ఛానల్ లో ప్రీమియర్ అయ్యింది. అదే రోజు సాయంత్రం ఇండియా న్యూజిలాండ్ ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉంది. ఇంకేం పడయప్పాను ఎవరు చూస్తారనుకునే అంచనాను పూర్తి తలకిందులు చేస్తూ సంచలనాలు నమోదు చేసింది

 

టీవీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 17.75 టిఆర్పి సాధించింది పడయప్పా. యాడ్స్ తో కలిపి సుమారు మూడున్నర గంటలకు పైగా సాగిన టెలికాస్ట్ ని అంత ఓపిగ్గా చూశారంటే ఈ సినిమా సాధించిన స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నెల క్రితం థియేటర్లలో రిలీజైన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ డాక్టర్ కు సైతం ఇంచుమించు ఇదే ఫిగర్ నమోదు కావడం గమనార్హం. ఓటిటిలు, యుట్యూబ్, పైరసీ సైట్లు ఇన్ని ఆప్షన్లు ఉన్నా కూడా రజిని చిత్రాన్ని ఇలా చూడటం ఈ రోజుల్లో విశేషమే. ప్రసారమవుతున్న రోజు కూడా సోషల్ మీడియాలో దీని మీద పోస్టులు గట్టిగానే తిరిగాయి. చూస్తుండగా తీసిన ఫోటోలు వీడియోలు చక్కర్లు కొట్టడం విశేషం

దీనికి ప్రత్యేక కారణం ఉంది. పడయప్పా చివరిసారిగా టీవీలో వచ్చింది 2014లో. తర్వాత రాలేదు. తెలుగులో రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది కానీ తమిళంలో మాత్రం అలా జరగలేదు. అందుకే అభిమానులు నోస్టాల్జిక్ ఫీలింగ్ తో చూసేశారు. దానికి తోడు పెద్దన్న రిలీజ్ కు దగ్గరలో వేయడంతో ఆ కనెక్షన్ కూడా పనికి వచ్చింది. రజనీకాంత్ రమ్యకృష్ణల పోటాపోటీ నటన, అద్భుత కథాకథనాలు, రెహమాన్ సంగీతం, భారీ నిర్మాణం వెరసి నరసింహను ఇన్నేళ్ల తర్వాత ఈ స్థాయి ఆదరణ దక్కించుకునేలా చేశాయి. గతంలో కన్నడ శివరాజ్ కుమార్ ఓం సినిమా కూడా ఇరవై ఏళ్ళ తర్వాత శాటిలైట్ రైట్స్ 10 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పింది

Also Read : Sooryavanshi : టాక్ తేడాగా ఉన్నా వసూళ్లు ఘనంగా వచ్చాయి

Show comments