iDreamPost
android-app
ios-app

వంశీతో మాస్ రాజా సినిమా

  • Published Mar 13, 2020 | 10:14 AM Updated Updated Mar 13, 2020 | 10:14 AM
  • Published Mar 13, 2020 | 10:14 AMUpdated Mar 13, 2020 | 10:14 AM
వంశీతో మాస్ రాజా సినిమా

నాలుగు డిజాస్టర్లతో వరసగా ఎదురుదెబ్బలు తిన్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా క్రాక్ కోసం ఫైనల్ స్టేజి షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మతో ఓ మూవీ చేయబోతున్న రవితేజ దాని తర్వాత ప్రాజెక్ట్ ని కూడా ఒకే చేసినట్టు ఫ్రెష్ అప్ డేట్. స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకుని అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్యతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

దర్శకుడిగా డెబ్యూ విషయంలో ఆశించిన అంచనాలకు చేరుకోలేకపోయినా వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ ఎస్ చెప్పినట్టు తెలిసింది. కిక్ కథకుడిగా వంశీకి రవితేజతో ముందు నుంచే బాండింగ్ ఉంది. ఈ నేపధ్యంలో ఇద్దరి కాంబినేషన్ లో పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధమైనట్టుగా వినికిడి. ఎప్పుడు ప్రారంభమవుతుందనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. భారీ నిర్మాణ సంస్థ దీన్ని టేకప్ చేయబోతున్నట్టు న్యూస్.

హీరోయిన్, టెక్నికల్ టీమ్ తదితర వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. క్రాక్ విషయంలో రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. రమేష్ వర్మతో సినిమా మొదలుకాకముందే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. డిస్కో రాజా ఫ్లాప్ అయినప్పటికీ ఫాన్స్ మాత్రం రవితేజ రాబోయే ప్రాజెక్ట్స్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఇదే ఏడాదిలో రెండు సినిమాలతో రాబోతున్న రవితేజ ఏ మేరకు అలరిస్తాడో వేచి చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet