iDreamPost
android-app
ios-app

రెడ్ రామ్ లో నెగటివ్ మసాలా

  • Published Mar 11, 2020 | 9:01 AM Updated Updated Mar 11, 2020 | 9:01 AM
  • Published Mar 11, 2020 | 9:01 AMUpdated Mar 11, 2020 | 9:01 AM
రెడ్ రామ్ లో నెగటివ్ మసాలా

వచ్చే నెల విడుదల కాబోతున్న రామ్ రెడ్ మీద ఇప్పటికే ట్రేడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నటించిన మూవీ కావడంతో బజ్ కు ఎలాంటి లోటు లేకుండా పోతోంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన దక్కింది. అందులోనూ రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న మూవీ కనక ఫ్యాన్స్ దీన్నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. గత ఏడాది సాహో విలన్ అరుణ్ విజయ్ తమిళ్ లో నటించిన తడంకు ఇది రీమేక్. మేకర్స్ అధికారికంగా బయటికి చెప్పనప్పటికీ ఇది దానికి తెలుగు రూపమే అన్నది ఓపెన్ సీక్రెట్.

ఒక మర్డర్ మిస్టరీలో ఇరుక్కున్న ఇద్దరు రామ్ లకు సంబంధించిన ట్రాక్ ఇందులో చాలా ఆసక్తిగా సాగుతుందని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా రఫ్ గా ఉండే ఓ రామ్ పాత్ర నెగటివ్ షేడ్స్ లో ఉంటూనే ఇస్మార్ట్ శంకర్ కు మించిన మసాలాతో దర్శకుడు తిరుమల కిషోర్ దీన్ని తీర్చిదిద్దినట్టుగా వినికిడి. పోలీస్ స్టేషన్ సీన్స్ లో రామ్ చూపించిన పెర్ఫార్మన్స్ ఇప్పటిదాకా కెరీర్ బెస్ట్ అనే టాక్ కూడా అందుతోంది. ఈ లెక్కన రెడ్ కనక అంచనాలకు తగ్గట్టు ఉంటే మరో బ్లాక్ బస్టర్ ఖాయమే అని చెప్పొచ్చు. అందులోనూ చాలా కాలం తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చి క్రేజీ ప్రాజెక్ట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న మణిశర్మ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ కానుంది.

రామ్ ఇప్పటిదాకా కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ లో నటించలేదు. ఈ కోణంలోనూ రెడ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. లేడీ పోలీస్ ఆఫీసర్ గా నివేత పేతురాజ్ పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట. మొత్తానికి మాస్ కు కావాల్సిన మసాలాలు ఏవి మిస్ కాకుండా అన్ని జానర్స్ ని టార్గెట్ చేసిన రెడ్ ఏప్రిల్ 9న విడుదల కాబోతోంది. సమ్మర్ ట్రీట్ గా వస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు కొత్త ఊపిరి ఇస్తుందనే ఆశతో ట్రేడ్ రెడ్ మీద పెట్టుబడులు బాగానే పెట్టింది. మరి ఈ రామ్ డబుల్ ట్రీట్ మాస్ మసాలా ఏ మేరకు మెప్పించబోతోందో తెలియాలంటే ఇంకో నెల రోజులు వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom