iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ డేట్లో నితిన్-వరుణ్ ఢీ ?

  • Published Mar 11, 2020 | 1:16 PM Updated Updated Mar 11, 2020 | 1:16 PM
  • Published Mar 11, 2020 | 1:16 PMUpdated Mar 11, 2020 | 1:16 PM
ఆర్ఆర్ఆర్ డేట్లో నితిన్-వరుణ్ ఢీ ?

భీష్మతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నితిన్ తన రెండేళ్ల గ్యాప్ కు సార్థకత చేకూర్చుకున్నాడు. వెయిటింగ్ టైం ఎక్కువైనప్పటికీ దీని సక్సెస్ పట్ల అభిమానునులూ సంతోషంగానే ఉన్నారు. ఒకవేళ సంక్రాంతి లాంటి పండగ సీజన్ అయితే భీష్మ ఇంకా ఎక్కువ వసూలు చేసేదన్న ట్రేడ్ వెర్షన్ లోనూ నిజముంది. ఇదిలా ఉండగా నితిన్ ప్రస్తుతం చేస్తున్న రంగ్ దే షూటింగ్ కీలక దశలో ఉంది. కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ తేజ్ తొలిప్రేమతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్నుతో ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ టేకింగ్ మీద ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడీ రంగ్ దే కూడా మంచి ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. ఇన్ సైడ్ టాక్ మేరకు రంగ్ దే రిలీజ్ డేట్ ని జులై 30కి లాక్ చేయాలనే దిశగా ప్లానింగ్ జరుగుతోందట. ఇది గతంలో ఆర్ఆర్ఆర్ కోసం రిజర్వ్ చేసిన తేదీ. అది వాయిదా పడటంతో అందరి కళ్ళు దీని మీద పడ్డాయి.

అయితే వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న సినిమా కూడా అదే రోజున రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయినట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా ఇది.

ఇటీవలే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని టీమ్ హైదరాబాద్ వచ్చింది. అనుకున్న ప్రకారం ఎలాంటి బ్రేకులు లేకుండా షూటింగ్ పూర్తయితే జులై 30ని విడుదలకు టార్గెట్ గా ఈజీగా పెట్టుకోవచ్చు. ఒకవేళ అదే నిజమైతే వరుణ్ కి నితిన్ కి క్లాష్ తప్పకపోవచ్చు. అయితే రెండు సినిమాల యూనిట్లు దీని మీద అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు క్లారిటీ రాకపోవచ్చు కానీ ప్రాధమిక దశలో ఇద్దరూ అదే డేట్ మీద కన్ను వేశారని సమాచారం. సో నితిన్ వరుణ్ మధ్య ఇంటరెస్టింగ్ బాక్స్ ఆఫీస్ వార్ ఉంటుందన్న మాట. చూద్దాం.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom