Idream media
Idream media
పది నెలలుగా కరోనా వైరస్ వల్ల సతమతమైన ప్రజలకు.. మరో ముప్పు పొంచిఉన్నట్లు కనిపిస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా న్యూసై్టయిన్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌లో వెలుగులోకి వచ్చిన న్యూ స్ట్రెయిన్ వైరస్.. అక్కడ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పలువురు ఈ వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ కేసు వెలుగులోకి రాగా. తాజాగా నెల్లూరు నగరంలో ఒకరికి న్యూస్ట్రెయిన్ వైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ నిర్థారించారు. బ్రిటన్ నుంచి నెల్లూరు జిల్లాకు 46 మంది రాగా.. వీరందరికీ పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ చెబుతున్నారు. సెంకడరీ, థర్డ్ కాంటాక్ట్‌లు కూడా గుర్తించామని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు.
ఓ వైపు న్యూస్ట్రెయిన్ వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండగా.. మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీలో మరో రాజకీయ నాయకుడుకి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. కర్నూలు జిల్లా నంధ్యాలకు చెందిన వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు.. కరోనా లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలిసింది. దీంతో అప్రమత్తమైన శిల్పా మోహన్ రెడ్డి… ఇటీవల తనను కలసిన వారు పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వస్తే.. ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఎవరికి ముందు వేయాలి..? ప్రాధాన్యతా క్రమాన్ని కూడా సిద్ధం చేశాయి. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందికి, వైద్య అనుబంధ రంగాల సిబ్బందికి, రెండో విడతలో ప్రజా సేవలో నిత్యం ఉండే పోలీసులు, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి, మూడో విడతలో వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇంచేందుకు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.