iDreamPost
android-app
ios-app

నెల్లూరు హెడ్ కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ SPకి.. చెన్నై సాఫ్ట్ వేర్ లేఖ!

పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో ఎనలేని గౌరవం, నమ్మకం ఉంది. అన్యాయం జరిగితే తొలుత ఆశ్రయించేది పోలీసులనే. అయితే నిందితుల పాలిట సింహ స్వప్నంలా మరిపోయే పోలీసులు.. కష్ట కాలంలో మానవత్వాన్ని చాటుతుంటారు. తాజాగా..

పోలీసు వ్యవస్థ అంటే ప్రజల్లో ఎనలేని గౌరవం, నమ్మకం ఉంది. అన్యాయం జరిగితే తొలుత ఆశ్రయించేది పోలీసులనే. అయితే నిందితుల పాలిట సింహ స్వప్నంలా మరిపోయే పోలీసులు.. కష్ట కాలంలో మానవత్వాన్ని చాటుతుంటారు. తాజాగా..

నెల్లూరు హెడ్ కానిస్టేబుల్‌ను ప్రశంసిస్తూ SPకి.. చెన్నై సాఫ్ట్ వేర్ లేఖ!

శాంతి భద్రతలే ధ్యేయంగా, ప్రజా రక్షణే బాధ్యతగా తీసుకుంటారు పోలీసులు. అన్యాయం జరిగిన చోట నిమిషాల్లో ప్రత్యక్షమయ్యి.. బాధితులకు తామున్నామన్న భరోసాను కల్పిస్తుంటారు. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ అహర్నిశలు పాటుపడుతుంటారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా వారికి అండగా నిలబడేది రక్షకభటులే. అలాగే తమపై గౌరవం కలిగేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి చర్యలు చేపడుతున్నారు. ఖాకీలు చేస్తున్న సేవల గురించి ఎంత కొనియాడినా తక్కువే. అందుకే పోలీసులన్నా, ఆ వ్యవస్థ అన్నా ప్రజలకు ఎనలేని నమ్మకం. కష్టకాలంలో ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇదే మరోసారి నిరూపితమైంది. చెన్నైకి చెందిన ఓ వృద్ధ దంపతులకు ఊహించని ఆపద రాగా, సకాలంలో స్పందించి వారిని ఆ కష్టం నుండి గట్టెక్కించారు నెల్లూరు కానిస్టేబుల్.

నెల్లూరు కానిస్టేబుల్‌ను చేసిన పనిని కొనియాడుతూ చెన్నై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు జిల్లా ఎస్పీకి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే.. ఇటీవల ఏపీలోని నెల్లూరు బారాషహీద్‌ దర్గా వద్ద రొట్టెల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చెన్నైకి చెందిన వృద్ధ దంపతులు వచ్చారు. కావాల్సిన రొట్టెలు తీసుకున్నారు. ఈ క్రమంలో డబ్బులు, మొబైల్స్ ఉన్న సంచిని పోగొట్టుకున్నారు. ఓ వైపు ఇద్దరికీ షుగర్ ఉండటం, ఆకలితో ఏం చేయాలో తెలియక భిక్షాటన చేయాలనుకున్నారు. అయితే ఇద్దరు దీనంగా కనిపించడంతో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ గమనించారు. వారి వద్దకు వెళ్లి వివరాలు అడగ్గా.. తాము చెన్నై నుండి వచ్చామని, డబ్బులు పోగోట్టుకున్నామని చెప్పడంతో.. వారికి భోజనం పెట్టించి.. ఆటో ఎక్కించి, ఇంటికి వెళ్లేందుకు రూ. 500 చార్జీలకు ఇచ్చారు.

ఇంటికి వెళ్లాక తిరిగి పంపిస్తామని చెప్పినప్పటికీ.. వద్దని సముదాయించి వృద్ధ దంపతులను పంపించారు. కష్ట కాలంలో తన తల్లిదండ్రుల్ని ఆదుకుని భోజనం పెట్టి పంపించిన కానిస్టేబుల్ మస్తాన్ సేవలను కొనియాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌కు లేఖ రాశాడు సాఫ్ట్ వేర్. తన తల్లిదండ్రులకు ఇచ్చిన రూ. 500 నగదును తిరిగి పంపించడంతో పాటు లేఖను రాశాడు. కష్టకాలంలో తమ తల్లిదండ్రుల్ని ఆదుకుని, వారికి ఆహారం ఇవ్వడంతో పాటు ఇంటికి సురక్షితంగా చేరుకునేలా డబ్బులిచ్చిన ఆయన సాయానికి, మానవత్వానికి హేట్సాఫ్ అని అన్నారు. మస్తాన్‌కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపాడు. నెల్లూరు ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ మస్తాన్‌ను అభినందించి, నగదు రివార్డును ప్రకటించారు. కష్టాల్లో ఆదుకున్న అతడ్ని గొప్ప మనస్సును ప్రశంసిస్తున్నారు.