iDreamPost
android-app
ios-app

నన్ను అలా ఫోటోలు తీసి.. జానీ మాస్టర్ అల్లుడు ఫిర్యాదులో విస్తుపోయే విషయాలు

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. ఆయన మేనల్లుడు సమీర్ పోలీసులకు బాధితురాలిపైనే ఫిర్యాదు చేశాడు. ఆమె తనను మూడేళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తుందని పేర్కొన్నాడు.

జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. ఆయన మేనల్లుడు సమీర్ పోలీసులకు బాధితురాలిపైనే ఫిర్యాదు చేశాడు. ఆమె తనను మూడేళ్లుగా మానసికంగా, శారీరకంగా వేధిస్తుందని పేర్కొన్నాడు.

నన్ను అలా ఫోటోలు తీసి.. జానీ మాస్టర్ అల్లుడు ఫిర్యాదులో విస్తుపోయే విషయాలు

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు, పలు ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సమీర్ అనే యువకుడు. సమీర్ జానీకి వరుసకు అల్లుడు అవుతాడు. తనను ఏదైనా చేస్తుందన్న భయంతోనే ఇప్పటి వరకు బయటకు రాలేదన్న సమీర్.. జానీ మాస్టర్ తల్లి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతుండటంతోనే బయటకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నాడు. యువతిపై నెల్లూరు పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన మామ దగ్గర పని చేసి, అతడిపైనే లైంగిక ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ తనను మూడేళ్లుగా మానసికంగా, శారీరకంగా హింసించిందని సమీర్ చెప్పడం కొసమెరుపు.

‘ఆ ఉమెన్ కొరియోగ్రాఫర్‌తో షూటింగ్ సమయంలోనే పరిచయం ఏర్పడింది. 2021లో జులై 2న చెన్నైలోని ఓ హోటల్‌లో యువతి, నేను కలిశాం. అప్పుడు ఆమె నన్ను తన రూమ్‌లోకి పిలిచింది. నగ్నంగా ఫోటోలు తీయడమే కాకుండా, శారీరక వాంఛ తీర్చాలంటూ వేధించింది. లిఫ్టులు, షూటింగ్‌లో విశ్రాంతి తీసుకునే వాహనంలో కూడా లైంగిక దాడికి పాల్పడింది. అప్పుడు నేను మైనర్. ఈ విషయం ఎవరికైనా చెబితే నా నగ్న ఫోటోలు బయటపెడతానని మూడేళ్లుగా భయపెడుతుంది’ అంటూ కంప్లయింట్‌లో పేర్కొన్నాడు సమీర్. యువతి, తనకు మధ్య జరిగిన కొన్ని చాటింగ్స్, కొన్ని ఫోటోలను పోలీసులకు అందించాడు. అందులో కొన్ని క్లోజ్‌గా ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తన మామపైనే కేసు పెట్టిందని, దీని వల్ల జానీ మాస్టర్ అమ్మ ఆసుపత్రి పాలయ్యిందని పేర్కొన్నాడు.

తనతో మాత్రమే కాదు.. చాలా మంది అబ్బాయిలతో కూడా ఇలా ప్రవర్తించేదని ఆరోపించాడు సమీర్. పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ‘అమ్మాయిలకు మాత్రమే చట్టాలు ఉన్నాయా? అబ్బాయిలకు వర్తించవా..? నేను మైనర్‌గా ఉన్నప్పుడు నన్ను వేధించింది. పోక్సో చట్టం ఒక అమ్మాయికేనా? అబ్బాయిలకు లేదా? నా నగ్న ఫొటోలు తన దగ్గర పెట్టుకుని నన్ను వేధిస్తోంది. ఆ ఫోటోలను డిలీట్ చేయించి నాకు న్యాయం జరిగేలా చూడాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా సరైన స్పందన లేదు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని మీ మామకు చెబుతాను అని బెదిరిస్తోంది. మూడేళ్ల పాటు నన్ను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసింది. ఈ రోజు జానీ మాస్టర్ తల్లికి వచ్చిన పరిస్థితి.. రేపు నాకు, నా తల్లికి ఆ పరిస్థితి రాకూడదని నేరుగా నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాను’ అని చెబుతున్నాడు సమీర్. ఇదిలా ఉంటే నెల్లూరు పోలీసులు.. ఈ వివరాలు నిజమేనవా కావా అన్న వివరాలు సేకరిస్తున్నారట. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాంతాలు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన నేపథ్యంలో అక్కడి పోలీసులకు పంపాలని భావిస్తున్నారు. అయితే మూడేళ్ల తర్వాత సమీర్ ఈ కేసు పెట్టడంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మరీ  మీ అభిప్రాయమేమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.