iDreamPost
android-app
ios-app

పదో తరగతి పరీక్షల పై మంత్రి సురేష్ క్లారిటీ

పదో తరగతి పరీక్షల పై మంత్రి సురేష్ క్లారిటీ

కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన పదో తరగతి పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. జూలైలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ షెడ్యూల్ ను ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సదరు షెడ్యూల్ ను విడుదల చేస్తామని వెల్లడించారు. లాక్ డౌన్ తర్వాత ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. పిల్లలకు ఇబ్బంది లేకుండా పరీక్షలకు సన్నద్ధమయ్యే అందుకు తగిన సమయం ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్ వివరించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఇటీవల సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. నకిలీ షెడ్యూల్ ను రూపొందించిన కొందరు ఆకతాయిలు విద్యార్థులను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కూడా స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వమే షెడ్యూల్ ను నేరుగా ప్రకటిస్తుందని అప్పటివరకూ ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇవ్వడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలుగుతోంది.