iDreamPost
android-app
ios-app

దర్శకుల పేర్లతో మెగా షాక్

  • Published Apr 20, 2020 | 8:29 AM Updated Updated Apr 20, 2020 | 8:29 AM
  • Published Apr 20, 2020 | 8:29 AMUpdated Apr 20, 2020 | 8:29 AM
దర్శకుల పేర్లతో మెగా షాక్

లాక్ డౌన్ టైంని సిసిసి (కరోనా చారిటీ క్రైసిస్)పనులతో పాటు ఇంట్లోనే గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో చిన్నపాటి షాకులు ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ ని సుజిత్ హ్యాండిల్ చేయబోతున్నాడన్న వార్త పది రోజుల క్రితం నుంచే ప్రచారంలో ఉంది కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. ఇక దర్శకుడు బాబీతో ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న టాక్ ని ఇటీవలే మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అసలు ఎవరూ ఊహించని పేరు చిరు నోటి వెంట రావడం అసలు షాక్.

మెహెర్ రమేష్ తనకో కథ చెప్పాడని ఫ్యూచర్ లో అతనితో చేయొచ్చని చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మెహెర్ రమేష్ చాలా కాలం నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. 2013లో విక్టరీ వెంకటేష్ షాడో తర్వాత మళ్ళీ మైక్ అందుకోలేదు. చిరుతో పాటు మహేష్ బాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే రమేష్ ప్రస్తుతం సిసిసి పనుల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఫ్యాన్స్ వర్రీకి కారణం ఇతని ట్రాక్ రికార్డు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన శక్తి తెచ్చిన చెడ్డపేరు అంతా ఇంతా కాదు.

అంతకుముందు చేసిన కంత్రి జస్ట్ ఓకే అనిపించుకున్నా వసూళ్ళ పరంగా కాస్ట్ ఫెయిల్యూర్ గానే నిలిచింది. బిల్లా పర్లేదు అనిపించుకుంది కాని అది తమిళ్ సినిమాకు ప్యూర్ రీమేక్ కావడంతో ఇతని టాలెంట్ ని ఖచ్చితంగా అంచనా వేసే అవకాశం లేకపోయింది. మరి మెహెర్ రమేష్ చెప్పిన ఏ కథ అంత గొప్పగా నచ్చిందో చూడాలి మరి. చిరు చెప్పిన ప్రకారం ముందు ఆచార్య ఫినిష్ చేయాలి. ఆ తర్వాత లూసిఫర్ రీమేక్. అటుపై బాబీతో సినిమా. ఈ మూడు పూర్తయ్యేలోపు ఎంత లేదన్నా మూడేళ్ళకు పైగా పడుతుంది. అప్పటిదాకా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం కాని ఇప్పటికైతే తాను భవిష్యత్తులో చేయబోయే దర్శకుల పేర్లతో మెగాస్టార్ ఒక స్వీట్ షాక్ ఇచ్చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet