రాళ్ళ దాడి ఒకవైపు – పూల వర్షం మరోవైపు

  • Published - 02:24 PM, Thu - 2 April 20
రాళ్ళ దాడి ఒకవైపు – పూల వర్షం మరోవైపు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి డాక్టర్లు హెల్త్ వర్కర్లు చేస్తున్న కృషి అద్భుతం.. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న డాక్టర్లు హెల్త్ వర్కర్ల కృషిని గుర్తించి,జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం కరతాళ ధ్వనులతో దేశం యావత్తు ప్రశంసించింది.

కానీ ఈరోజు ఇండోర్ లో కరోనా పరీక్షలు చేయడానికి వెళ్లిన డాక్టర్లు హెల్త్ వర్కర్లపై దాడి చేయడానికి కొందరు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. రాళ్లతో, కర్రలతో గుంపులుగా ఏర్పడి మరీ డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది.. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. డాక్టర్లపై దాడిని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా రాళ్లతో దాడి చేయడం, వాళ్ళు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకుని మరీ దాడికి తెగబడటం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది.

ఒకవైపు ఇండోర్ లో డాక్టర్లపై రాళ్ళ దాడి జరిగితే మరోవైపు పంజాబ్ లో డాక్టర్లపై, పూల వర్షం కురిపించి డాక్టర్లు హెల్త్ వర్కర్ల కృషిని ప్రశంసించారు అక్కడి ప్రజలు.. వీధుల్లో వెళ్తున్న డాక్టర్లపై ఇంటి పై కప్పుల నుండి పూల వర్షం కురిపించి దండలు వారిపై వేసి వారి కృషిని ప్రశంసించారు పంజాబ్ ప్రజలు..

హెల్త్ వర్కర్లు, డాక్టర్లపై జరిగిన దాడిని దేశవ్యాప్తంగా పలువురు ఖండించారు. మనకోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న డాక్టర్ల కృషిని గుర్తించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా పంజాబ్ ప్రజలు డాక్టర్లు హెల్త్ వర్కర్ల కృషిని గుర్తించినందుకు పలువురు ప్రశంసిస్తున్నారు..

Show comments