iDreamPost
android-app
ios-app

Canada: హిందువులను కొడుతూ గుడిపై దాడులు..కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు!

  • Published Nov 04, 2024 | 3:17 PM Updated Updated Nov 04, 2024 | 3:17 PM

Canada: కెనడాలో హిందువులపై దాడులు ఆగట్లేదనే చెప్పాలి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Canada: కెనడాలో హిందువులపై దాడులు ఆగట్లేదనే చెప్పాలి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Canada: హిందువులను కొడుతూ గుడిపై దాడులు..కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీలు!

కెనడాలో హిందువులకు సేఫ్టీ లేకుండా పోయింది. అక్కడ హిందువుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశంలో నివసిస్తున్న హిందువులు బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఉన్నారు. ఏ క్షణాన ఎలాంటి దాడి జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికీ కూడా హిందువులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రాంప్టన్ లో మరోసారి హిందువులపై దాడులు జరిగాయి. దాడులతో రెచ్చిపోయారు ఖలిస్తానీ తీవ్ర వాదులు. బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దారుణంగా దాడి చేశారు. అక్కడకి వచ్చిన భక్తులను విచక్షణ రహితంగా కొట్టారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఎంతగానో కలచి వేస్తోంది.

కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం.. గుడిపై, భక్తులపై దాడి జరగడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. మళ్లీ మళ్లీ హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కెనడాలో హిందూ దేవాలయాలను టార్గెట్ గా చేసుకున్నారు ఖలిస్తానీలు. వారు అక్కడ దేవాలయాల గోడలపై భారత దేశానికి ఇంకా హిందువలకు వ్యతిరేకంగా నినాదాలు రాస్తున్నారు. అసలు ఈ విధ్వంసాలకు కారణం ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం. అతని మరణం తర్వాత.. ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. మానవత్వం మరచిపోతున్నారు. కెనడాలో ఇటువంటి దారుణమైన పనులను పెంచారు. జూన్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ కాల్చి చంపబడ్డాడు. అతని మరణంతో రెచ్చిపోయారు ఖలిస్తానీ సపోర్టర్స్. దాంతో గత జూలైలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు.

గత ఏడాది కూడా కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్లు చాలా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అప్పుడు దుండగులు ఫేమస్ టెంపుల్ లక్ష్మీనారాయణ ఆలయాన్ని టార్గెట్ చేశారు. ఆ గుడి గేటు, వెనుక గోడపై భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ, ఖలిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ క పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్ల పై హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫోటో ఉంది. సర్రేలోని లక్ష్మీ నారాయణ్ గుడి బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని పురాతన గుడి. ఇది అతిపెద్ద హిందూ దేవాలయం కావడంతో ఎక్కువ మంది హిందువులు ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు.

ఇక తాజాగా జరిగిన దాడి పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ ఘటనని ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక ఘటనలు సరైనవి కాదని ఆయన అన్నారు. కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ కూడా తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని అన్నారు. ప్రతి కెనడియన్‌కు కూడా తమ మత విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై తక్షణమే స్పందించి యాక్షన్ లోకి దిగారు పీల్ పోలీసులు. అందుకు ట్రూడో వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటన గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.