iDreamPost
android-app
ios-app

“అతనే నా సర్వస్వం.. తన కోసమే ఇండియాలో ఉంటున్నా..” సెన్సేషనల్ కామెంట్స్ చేసిన Hardik Pandya మాజీ భార్య!

  • Published Nov 09, 2024 | 3:44 PM Updated Updated Nov 09, 2024 | 3:44 PM

Natasha Stankovic: హార్దిక్‌ పాండ్య మాజీ భార్య నటాషా తనపై వస్తున్న విమర్శలపై స్పందించింది. స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది.

Natasha Stankovic: హార్దిక్‌ పాండ్య మాజీ భార్య నటాషా తనపై వస్తున్న విమర్శలపై స్పందించింది. స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది.

  • Published Nov 09, 2024 | 3:44 PMUpdated Nov 09, 2024 | 3:44 PM
“అతనే నా సర్వస్వం.. తన కోసమే ఇండియాలో ఉంటున్నా..”  సెన్సేషనల్ కామెంట్స్ చేసిన Hardik Pandya మాజీ భార్య!

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్ హార్దిక్‌ పాండ్య, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోయాక తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నటాషా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. పాండ్యతో విడిపోయాక ఇండియాని వదిలి సెర్బియా వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఆమె రియాక్ట్ అయ్యింది. అవన్నీ కేవలం రూమర్లే అని నటాషా కొట్టిపడేసింది. తన ముద్దుల కొడుకు ఇక్కడే స్కూల్‌కు వెళ్తున్నాడని.. అలాంటిది తనని వదిలి పెట్టి సెర్బియాకు ఎలా వెళ్తానని ప్రశ్నించింది. తన బిడ్డని వదిలి సెర్బియాకు వెళ్లే ప్రసక్తే లేదని అది ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పింది. హార్దిక్‌తో విడిపోయినా కూడా ఇప్పటికీ తామంతా కుటుంబసభ్యులుగానే ఉన్నామని చెప్పింది. దానికి కారణం తమ కొడుకే అని, తన వల్లే ఓ ఫ్యామిలీగా కొనసాగుతున్నామనీ తెలిపింది.

ఇంకా మాట్లాడుతూ .. “నేను హార్దిక్‌తో కలిసి ఉండలేను కానీ, అగస్త్యకు మాత్రం ఇద్దరం పేరెంట్స్‌గా ఉంటాం. నేను సెర్బియాకు ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటా. దాదాపు పదేళ్ళ నుంచి ఇలానే జరుగుతోంది.సింగిల్‌ పేరెంట్‌గా ఉన్నా నేను చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉన్నా. పర్సనల్ గా నా బిడ్డకి మంచి ఫ్యూచర్ ని ఇచ్చేందుకు కష్టపడుతూనే ఉంటా. అగస్త్యతో నా ప్రేమను పంచుకుంటూనే ఉన్నా. తను హ్యాపీగా ఉండాలంటే అలానే చేయాలని నాకు అర్థమైంది. నా బిడ్డకి తల్లిగా నా అవసరం ఉంది. తన కోసం మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు తపిస్తున్నా. నేనెప్పటికీ డౌన్ అవ్వను. నన్నెవరూ టచ్‌ చేయలేరనే విధంగా స్ట్రాంగ్ అవుతా. దేనికైనా స్ట్రాంగ్ గా నిలబడతా. ఎన్ని ట్రోల్స్, కామెంట్స్ చేసినా నేను పట్టించుకోను. నా మనసు ఎంత స్వచ్ఛంగా ఉందో నాకు తెలుసు. దానిని ఎవరూ కూడా చెడగొట్టలేరు. తప్పకుండా కెరీర్ లో ఇంకా ముందుకు వెళతా అనే నమ్మకం ఉంది. ఇప్పటి దాకా నా లైఫ్ లో నేను గిల్టీగా అస్సలు లేను. నా కొడుకుకి ఎక్కువ టైమ్ ఇస్తా.. తనే నా సర్వస్వం.. తన కోసమే ఇండియాలో ఉన్నా” అని నటాషా తెలిపింది.

ఈ కామెంట్స్ తో నటాషా తనపై వస్తున్న ట్రోల్స్, కామెంట్స్ కి చెక్ పెట్టింది. తాను ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ కామెంట్స్ ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. నటాషా కామెంట్స్ కి నెటిజెన్స్ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తన బిడ్డ కోసం ఇంత స్ట్రాంగ్ అవ్వడం చాలా గ్రేట్ అంటున్నారు. తను ఇలాగే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ సంగతి. ఇక నటాషా చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio