iDreamPost
android-app
ios-app

అందుబాటు ధరలో Amazon నుంచి వైద్య సేవలు!

  • Published Nov 08, 2024 | 5:50 PM Updated Updated Nov 08, 2024 | 5:50 PM

Amazon: అమెజాన్ మెడికల్ సర్వీసెస్ ని అందిస్తుంది. అందుకోసం అమెజాన్ క్లినిక్ ని ప్రవేశ పెట్టింది.

Amazon: అమెజాన్ మెడికల్ సర్వీసెస్ ని అందిస్తుంది. అందుకోసం అమెజాన్ క్లినిక్ ని ప్రవేశ పెట్టింది.

అందుబాటు ధరలో Amazon నుంచి వైద్య సేవలు!

అమెజాన్ తన సర్వీసెస్ తో వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సర్వీస్ ని ప్రవేశ పెడుతుంది. ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ సర్వీస్ గా ‘అమెజాన్ క్లినిక్’ ను భారత దేశంలో ప్రవేశ పెట్టింది. దీని ద్వారా వైద్య సమస్యలకు అందుబాటు ధరలో ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లను అందిస్తుంది. అంటే ప్రజలు అమెజాన్ యాప్ ద్వారా నేరుగా వైద్య సేవలు పొందవచ్చు. మంచి మంచి వైద్య నిపుణులతో అపాయింట్‌మెంట్లను కూడా బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అమెజాన్ క్లినిక్ సర్వీస్ చాలా తక్కువ ధరకే స్టార్ట్ అవుతుంది. ఈ సర్వీస్ కేవలం రూ.299తో స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రాక్టీ వంటి ఫ్లాట్ ఫార్మ్ల లాగానే ఈ సర్వీస్ పని చేస్తుంది.ఇక ఈ సర్వీస్ ద్వారా, ప్రజలు 50 కంటే ఎక్కువ వ్యాధులకు సంబంధించి సర్వీసెస్ పొందవచ్చు . ఆన్‌లైన్ ద్వారా వైద్యులతో మాట్లాడవచ్చు. వారితో సంప్రదింపులు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం, అమెజాన్ క్లినిక్ సర్వీస్ Android, iOS వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ ని డెస్క్‌టాప్‌లో మాత్రం ఉపయోగించలేరు. డాక్టర్ల సంప్రదింపులను బుక్ చేసుకునే ముందు కచ్చితంగా మీ పేరు, వయస్సు, జెండర్, ఫోన్ నంబర్‌ను ఇవ్వాలి. అలా మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి.ఇక ఆ తర్వాత డాక్టర్ నుండి ఆన్‌లైన్ సంప్రదింపులు పొందే ఫెసిలిటీని పొందుతారు. మీరు అసరమైతే, క్లినిక్‌కి వెళ్లి డాక్టర్ ని కలవవచ్చు. అయితే క్లినిక్‌లో వైద్యుడిని కలిసే సౌకర్యం అన్ని చోట్లా లేదు.

అమెజాన్ క్లినిక్‌ సర్వీస్ లో డెర్మటాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ కౌన్సెలింగ్ వంటి విభాగాల్లో కూడా ఎన్నో నిపుణులైన వైద్యులు ఉన్నారు. ఈ క్లినిక్‌లో లిస్ట్ లో డాక్టర్ ల హిస్టరీని కూడా చెక్ చేయవచ్చు. ఇందులో వైద్య నిపుణులందరికీ కూడా టెలి-కన్సల్టేషన్‌లో కనీసం మూడేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. ఇంకా ఇది కాకుండా అమెజాన్ క్లినిక్ చాలా సేఫ్. ఇందులో అన్ని మెడికల్ రికార్డులు కూడా సేఫ్ గా ఉంచుతామని అమెజాన్ వెల్లడించింది. దీనికి ఫీజు కేవలం రూ. 299 నుండి రూ. 799 మధ్య ఉంటుంది. వర్చువల్ కన్సల్టేషన్‌లో వారం పాటు ఫ్రీ ఫాలో-అప్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాదండోయ్ ఈ క్లినిక్ లో అమెజాన్‌లో ఫార్మసీ స్టోర్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఈజీగా మందులను కొనుక్కోవచ్చు. ఇదీ సంగతి. ఇక అమెజాన్ క్లినిక్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.