Idream media
Idream media
రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని అమరిందర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మరిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరిందర్ తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఐతే వైరస్ నియంత్రణ లోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను పొడిగించాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలన్న డిమాండ్లు రావడంతో వైరస్ కట్టడి, లాక్ డౌన్ పొడిగింపు పై ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్ డౌన్ పొడిగింపున కే మొగ్గు చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేసినా తాము మాత్రం కొనసాగిస్తామని ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.