కోల్‌కతా హత్యాచార ఘటన.. ఇక గణేష్ ఉత్సవాలలో ఆ హడావిడి ఉండదు!

Kolkata Ganesh Festival Committee: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కోల్‌కొతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యం గురించే మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Kolkata Ganesh Festival Committee: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కోల్‌కొతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అఘాయిత్యం గురించే మాట్లాడుతున్నారు. ఈ ఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడి గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇటీవల దేశంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కోల్‌కొతాలోని ప్రభుత్వ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ మహిళా డాక్టర్ ని అత్యాచారం చేయడమే కాదు, దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని సామాన్యులు, డాక్టర్లు, సెలబ్రెటీలు సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగి 20 రోజులు అవుతున్నా.. ప్రజల్లో మాత్రం ఆగ్రహావేశాలు చల్లారడం లేదు.. తాజాగా కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో  గణేష్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయవ తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

కోల్‌కొతాలో ట్రైనీ డాక్టర్ పై రేప్, మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నాయి. సుప్రీం కోర్టు సుమోటాగా తీసుకొని విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి అండగా యావత్ భారత దేశం కదిలింది. తాజాగా కోల్‌కతా ట్రెయినీ డాక్ట‌ర్‌ అత్యాచార ఘటన నేపథ్యంలో కోల్‌కొతా గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఉత్సవాల్లో ఎలాంటి హంగులూ, ఆర్భాటాలు ఉండవని, రైట్లు, అలంకరణలకు దూరంగా ఉత్సవాలు జరిపించాలని నిర్ణయం తీసుకుంది. బాధితురాలి కుటుంబానికి తామంతా అండగా ఉన్నామన్న భరోసా కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.

పూజా కమిటీ ప్రెసిడెంట్ అనింద్యా చటర్జీ మాట్లాడుతూ.. ‘ఈసారి పండల్ కేవలం ఎరుపు రంగు లైట్లు మాత్రమే ఉపయోగిస్తాం. పీఎన్బీ ద్వీపం సమీపంలోని గణేష్ పండల్ పూర్తిగా ‘దర్శన్ రుఖ్ దిన్’ (అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం) అనే సందేశంలో కటౌట్స్ తో కప్పబడి ఉంటుందని ఆయన అన్నారు. గణేష్ పండల్ లో చిన్న చిన్న అక్షరాలతో కొన్ని నినాదాలు కూడా రాయిస్తామని అన్నారు. ఇకపై అత్యాచార ఘటనలు జరగకుండా చూడాలని, ఎంతోమంది ఆడపడుచులపై ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని, స్థానిక ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని పూజలు రద్దు చేయలేమని ఆయన అన్నారు. కాగా, మహిళా వైద్యురాలి హత్యకు నిరసనగా పూజలు చేయవొద్దని కొంతమంది డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Show comments