iDreamPost
android-app
ios-app

కియా కథనంపై అర్ధరాత్రి నుంచే పక్కా ప్లాన్‌

కియా కథనంపై అర్ధరాత్రి నుంచే పక్కా ప్లాన్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అండ్‌ కో, అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారాలు మరో దశను దాటిపోయాయి. తమ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే జాతీయ మీడియాను మేనేజ్‌ చేసి కథనాలు వేయించడం, దాన్ని పట్టుకొని లోకల్‌ నాయకులు, కొన్ని పత్రికలు హంగామా చేయడం ఇదే ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌.

ఆ క్రమంలోనే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పెయిడ్‌ కథనాలు రాయించడం చేసింది. దీనికి మంచి ఫీడ్‌బ్యాక్‌ రావడంతో మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని, అనంతపురంలోని కియా పరిశ్రమ తమిళనాడు వెళ్లిపోతోందంటూ రాయిటర్స్‌తో బుధవారం అర్ధరాత్రి కథనం రాయించింది. దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సోషల్‌మీడియాలో ప్రత్యేక బ్యాచ్‌లను రంగంలోకి దింపింది. తెలుగు పాఠకుల్లో సాధారణంగా రాయిటర్స్‌ను చదవరు. అందుకే ఆ కథనాన్ని పట్టుకొని తెల్లారేసరికల్లా పచ్చ తెలుగు మీడియా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఇదంతా చాలా పక్కాగా పూర్తి చేసేందుకు పలువురు పచ్చ మేధావులను ముందే రెడీ చేసి పెట్టారు. అమరావతి ముసుగులో భూములు కొల్లగొట్టిన వారిని గుర్తించిన సీఐడీ, ఈడీ తమ విచారణను వేగవంతం చేస్తున్న తరుణంలో.. ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలాంటి కథనాలు రాయించినట్లు తెలుస్తోంది.

ఖండించినా సరే విష ప్రచారం ఆగలేదు..
ప్రొద్దునే ఈ కథనం చూసిన కియా ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అటు తమిళనాడు అధికారులు కూడా కియాతో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చి చెప్పారు. అయినా సరే చంద్రబాబుతో సహా టీడీపీ నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్లే కియా వెళ్లిపోతోందంటూ శోకాలు వల్లించారు. మరోవైపు కియాపై క«థనాన్ని ఆదిత్య కర్లా, సుదర్శన్, అదితి షా రాశారని, అయితే తమకు తెలియకుండానే కథనం ప్రచురితమైందని చెప్పుకు రావడం గమనార్హం. మరోవైపు ఈ వార్తను తన ట్విట్టర్‌లో పెట్టుకున్న ఆదిత్య ఖాతాను ట్విట్టర్‌ స్తంభింపజేసింది. ఆ కథనంలో రాజకీయ దురుద్ధేశం ఉండడంతో ట్విట్టర్‌ యాడ్‌ పాలసీ ప్రకారం ట్వీట్లను తొలగించినట్లు పేర్కొంది.