iDreamPost
iDreamPost
19 ఏళ్ల శివప్రసాద్‌గా బ్లాక్‌బస్టర్ సినిమా KGFని చూశాడు. ఆ హీరోలాగే రాత్రికి రాత్రి పాపులర్ అవుదామనుకున్నాడు. ఈ సినిమాలో హీరోను పిల్లలు సుత్తివీరుడు అని పిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో నలుగురు సెక్యూరిటీ గార్డులను నిద్రలో హత్య చేసినట్లు భావిస్తున్న సీరియల్ కిల్లర్ CCTVకి చిక్కాడు. ఈ 19 ఏళ్ల సీరియల్ కిల్లర్ KGFని చూసి, ఆ హీరోలాగే కొట్టి చంపేశాడు.
హత్యచేసిన వాళ్లలోని ఒకరి మొబైల్ ఫోన్‌ను పోలీసులు ట్రాక్ చేసిన తర్వాత, భోపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ సీరియల్ కిల్లర్ ను అరెస్టు చేశారు.
సెక్యూరిటీ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలను చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఈ హంతకుడు షర్ట్, షార్ట్ వేసుకున్నాడు. బాధితుడిని కొట్టి, ఆపై అతని తలపై రాయితో బలంగా బాదాడు. తనని ఎవరూ చూడలేదని నిర్ధారించుకున్న తర్వాతే. ఈ కిల్లర్ దూరంగా పారిపోయాడు. ఈ కుర్రాడికి ఎందుకింత కర్కశత్వం? ఎందుకింత హింసాప్రవృత్తి?
పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ యువకుడు, కేవలం రాత్రిపూట మాత్రమే ఎటాక్ చేశాడు. KGF సినిమాలో హీరో కిల్లరే కదా. ఈ సినిమాను చూశాడు. ఐదుగురిని చంపిన తర్వాత పోలీసులను టార్గెట్ చేశాడు. ఆమేరకు ప్లాన్ కూడా చేశానని పోలీసులకు చెప్పాడు.
महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk
— Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022
శివప్రసాద్ సాగర్‌లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులను, భోపాల్‌లో మరొకరిని రాత్రి హత్య చేశాడు. అలాగని వాళ్లమీద ఇతనకేం కోపం లేదు. బాధితులెవరినీ దోచుకోలేదు. వాళ్లను చంపితే పది మంది మాట్లాడుకొంటారు. పాపులర్ కావచ్చన్నదే అతని ఏకైక లక్ష్యం. అతను నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డులను గుర్తించి, వాళ్లనే హత్యచేశాడు.
అతని మర్డర్లన్నీ ఒక పద్ధతిలోనే ఉన్నాయి. రాత్రిపూట మాత్రమే బండరాయితో కొట్టే “రాతి మనిషిష గురించి మధ్యప్రదేశలో భయాలు రేగాయి
ఎవరు దొరికితే వాళ్లనే హత్యచేశాడు. ఒక బాధితుడి మొబైల్ ఫోన్‌ను తీసుకువెళ్తుండగా పోలీసులు అతనిని ఫాలో అయ్యారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా అతను భోపాల్ లో పట్టుకున్నారు.
భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్‌లో శివప్రసాద్ హత్యాకాండ ప్రారంభమైంది. ఆగస్టు 28న ఫ్యాక్టరీలో గార్డు కళ్యాణ్ లోధి తలని సుత్తితో పగులగొట్టాడు. హత్యచేశాడు.
మరుసటి రోజు రాత్రి, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో 60 ఏళ్ల సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే రాళ్లతో కొట్టి చంపేశాడు. ఇలా అతను మొత్తంమీద ఐదుగురిని అకారణంగా పొట్టనపెట్టుకున్నాడు. చివరకు పట్టుబడ్డాడు.