iDreamPost
iDreamPost
సాధారణంగా మన స్టార్లు పొలిటికల్ జానర్ లో సినిమాలు చేయడం తక్కువ. లేనిపోని రిస్క్ ఎందుకని వాటికి దూరంగా ఉంటారు. అడపాదడపా వస్తుంటాయి కానీ మరీ గొప్ప ఫలితాలు అందుకున్నవి తక్కువే. చిరంజీవి ముఠామేస్త్రి, రానా లీడర్, మహేష్ బాబు భరత్ అనే నేను లాంటి కొన్ని ఉదాహరణలు కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అందుకున్నవిగా చెప్పుకోవచ్చు. అయితే ఇది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అంతగా కలిసి రాలేదు. స్టార్ డంతో మాంచి ఊపుమీదున్న టైంలో ఏఎం రత్నం నిర్మాతగా డికె సురేష్ సురేష్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ నాగ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది.
బిజినెస్ పరంగా చాలా క్రేజ్ తెచ్చుకున్న నాగ అంచనాలు అందుకోలేకపోయింది. అప్పటి తారక్ వయసుకు మించిన పాత్ర చేయడమే దానికి కారణమని అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. నాగ వచ్చి 17 ఏళ్ళు అయ్యింది. జూనియర్ వయసు రెట్టింపు అయ్యింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం తారక్ మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సబ్జెక్టులో చేయబోతున్నాడట. ఎవరితోనో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే. ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోతున్న మూవీగా ఇప్పటికే దీని మీద చాలా బజ్ వచ్చింది.
ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ ఉండకపోవచ్చు. అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇప్పటిదాకా త్రివిక్రమ్ సినిమాల తాలుకు టైటిల్ లీక్స్ అన్ని నిజమవుతూ వచ్చాయి. ఇది కూడా దాదాపు ఖరారుగానే అనుకోవచ్చు. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంబించి వచ్చే సమ్మర్ లో విడుదలకు ప్లాన్ చేశారు. అది కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడీ స్టొరీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్న వార్త నిజమో కాదో కాని నిప్పు లేనిదే పొగరాదుగా అనే తరహాలో అభిమానులకు ఇదే హాట్ టాపిక్ గా మారింది