Idream media
Idream media
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పురోగతికి పాటుపడుతుంది. ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతును ఇచ్చి..వారిని ముందుకు నడిపిస్తుంది. ఇటీవలి రైతులకు, మత్స్యకారులకు, ఆటోవాలాకు, పుజార్లకు, పాస్టర్లకు, ముస్లిం పెద్దలకు, చేనేత కార్మికులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతు కల్పించింది. నేరుగా వాళ్ల అకౌంట్స్ లో నగదు జమ చేసి ఆర్థిక మేథావులు, ఆర్థిక వేత్తల ఆలోచనలు ఆచరణలో పెట్టారు.
ఇప్పుడు షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. అందుకు సంబంధించి జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం సిఎం జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.
మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు. కరోనా కష్టకాలంలోనూ పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలబడింది.నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కరోనా కష్టకాలంలోనూ ప్రతీ కుటుంబానికి అండగా నిలబడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను జోరు కొనసాగిస్తున్నారు.
వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్(దర్జీ) అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం జగనన్న చేదోడు పేరుతో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందనుంది.
ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు.
షాపులున్న 1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60.000…. 82,347 మంది రజకులకు రూ. 82,34,70.000….38,767 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.38,76,70.000… మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.