కాదేదీ కవితకు అనర్హం అన్నారు ఓ మహాకవి. విషయం ఏదైనా రాజకీయానికి కాదు అనర్హం అని నిరూపిస్తున్నారు దేశంలోని రాజకీయ పార్టీల నేతలు. రాజకీయ ప్రత్యర్థులపై, ప్రభుత్వాలపై విమర్శలు చేసేందుకు కొంతమంది పొరుగుదేశాల పరిస్థితిని కూడా వినియోగించుకుంటున్నారు. ఆయా దేశాలతో స్థానిక ప్రభుత్వాలను పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటక రంగం దెబ్బతినడంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్షీణించింది.ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకులు లభించని పరిస్థితి […]
పశ్చిమ బెంగాల్లో బంపర్ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత.. నందిగ్రామ్ లో తన ఓటమిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని ఆమె ఇంతటితో వదిలిపెట్టేలా లేరు. ఇక్కడ రీ కౌంటింగ్ విషయంలో రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. అందుకే రీ కౌంటింగ్ చేపట్టాలన్న తమ పార్టీ డిమాండ్ ను తిరస్కరించారని పేర్కొన్నారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ నందిగ్రామ్ ఫలితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో […]
నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఉదయం నుంచి ఊరించి.. ఉడికిస్తూ వచ్చిన విజయం చివరికి మమత బెనర్జీనే వరించింది. శపథం చేసి మరీ ఆమె తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై ఆధిపత్యం ప్రదర్శించారు. 2016 ఎన్నికల్లో 81 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన సువేందును ఆ మెజారిటీ అంతా గల్లంతు చేసి 1200 ఓట్లతో అతన్ని మట్టి కురిపించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ విజయాన్ని పరిపూర్ణం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీపై […]
అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఆ రాష్ట్రంలో హాట్ సీటుగా మారిన నందిగ్రామ్ పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. దీనికి కారణం సీఎం మమతా బెనర్జీ స్వయంగా అక్కడ బరిలోకి దిగి.. తన మాజీ సహచరుడిని సవాల్ చేయడమే. వారిద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు ఎలా […]
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ క్లిష్టతరంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ తో కూడా ఢీ కొడుతోంది. నోటిఫికేషన్ విడుదల నుంచే ఈసీపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ఏకంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడాన్ని టీఎంసీ తప్పుబట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ లు విడుదలైన ఐదు రాష్ట్రాల కంటే బెంగాల్ లోనే ఇన్ని దశలు ఎందుకంటూ ప్రశ్నించింది. దానికి ఈసీ […]
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఢీ అంటే ఢీ అంటారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీపై విమర్శల దాడి చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. కానీ తన ఒక్కరి బలం సరిపోదని అనుకున్నారో, బెంగాల్ లో పట్టుకోల్పోతున్నట్లు భావించారో ఏమో.. దేశంలోని పలు పార్టీల నేతలకు లెటర్లు రాశారు. బీజేపీపై పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరి దీదీ పిలిస్తే పలికేదెవరు? మోడీ […]
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి , సీఎం మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని 15 పార్టీలకు రాసిన లేఖ చర్చకు దారితీసింది. బెంగాల్లో రెండోదశ పోలింగ్ కు ఒకరోజు ముందు రాసిన ఈ లేఖలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే మమతా లేఖలు పంపిన పార్టీల జాబితాలో తెలుగుదేశం మిస్ అవ్వడం […]
సమర్థవంతమైన పరిపాలనతో ప్రజలకు మంచి చేసేందుకు పరిపాలనా అనుభవం అవసరం లేదని 21 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, పరిపాలనా పరంగా తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలు ప్రజలకు అత్యున్నత స్థాయిలో మేలు చేశాయి. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా, సరళతరంగా అందుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, […]
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం)… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పాతబస్తీకి, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికే పరిమితమైన ఈ పార్టీ రూపురేఖలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నగరం దాటి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సత్తా చాటాలని ఎంఐఎం చేసిన ప్రయత్నాలు బిహార్ ఎన్నికల తర్వాత సఫలమవుతున్నాయి. గడచిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోవడం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచింపజేసింది. అంతకు ముందు మహారాష్ట్రలోనూ ఆ పార్టీ […]