2024 ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అన్న వాదనకు ఇప్పుడు బీహార్ గట్టి దెబ్బకొట్టింది. బీజేపీపై బీహార్ తిరుగుబాటు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. నిరాశల స్థానంలో ఆశలను పుట్టించింది. విపక్షానికో వ్యూహాన్ని చూపించింది. 2019 ఎన్నికల్లో BJP-JD(U) కూటమి బీహార్ ను ఊడ్చేసింది. 40 సీట్లలో 39 స్థానాలను గెల్చుకుంది. అందుకే బీజేపీకి అంతటి మెజార్టీ. ఇప్పుడు సీన్ రివర్స్. అందుకే 2024 ఎన్నికల్లో, ఉత్తర భారతదేశం మినహా మిగిలిన చోట్ల 2019 ఎన్నికలనాటి హవా […]
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, బీహార్ లో పోయింది. బీహార్ అధికార JD(U)-BJP కూటమిలో అనేక సమస్యలపై రెండునెలలుగా గందరగోళం. జేడీయు చీలుతుందన్న ఆందోళనల మధ్య ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలుసుకుని తన రాజీనామా లేఖ ఇచ్చారు. ఇక బీజేపీతో తెగతెంపులైనట్లే. నితీష్ ఇలా బీజేపీని కాదనుకోవడం ఇది రెండోసారి. బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను నిరాకరించడం వంటి అంశాలపై రెండు నెలలుగా JD(U), BJP మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికితోడు జేడీయు […]
ఒకపక్క మహారాష్ట్ర కేబినెట్ కూర్పులో బీజేపీ తలమునకలైన వేళ, బీహార్ లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో తరహాలో నితీష్ కుమార్ పార్టీని చీల్చుతారన్న ఊహాగానాల మధ్య, కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. ఈసారి పైఎత్తు నితీష్ కుమార్ దే. నితీష్ కుమార్ బీహార్‌లో బిజెపితో పొత్తును వదలనుకున్నారు. అధికార JD(U)-BJP కూటమిలో గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలవనున్నారు. ఇప్పటికే, పాట్నాలో జెడి(యు), ప్రతిపక్ష RJD తమ […]
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాద యాత్ర మొదలుపెట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకున్న పీకే.. అందరికీ షాకిస్తూ, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని తేల్చేశారు. అలాగని ఇది కొత్త పార్టీ ప్రకటన కాదు. ఎలాంటి రాజకీయ పార్టీ, రాజకీయ వేదికను ప్రకటించలేదు. ‘జన్ సురాజ్’ కోసం రాబోయే 3, 4 నెలలో అందరినీ కలిసి మాట్లాడుతా. నా అభిప్రాయంతో కలిసి వచ్చే వారిని, నా ఉద్యమంలో చేర్చుకుంటాను. నేను రాజకీయ పార్టీ పెడితే, అది ప్రశాంత్ కిషోర్ […]
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్సీపీ సింగ్‌కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2019లో పార్టీ చీఫ్‌గా తిరిగి ఎన్నికైన నితీష్ పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ ముందే తప్పుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా, పార్టీ పెద్దగా బాధ్యతలు ఒక్కరి వద్దే ఉండటం సరైనది కాదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. […]
బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్‌కుమార్ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపడతారని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ స్పష్టం చేయగా.. ఆ బాధ్యలు ఎప్పుడు చేపట్టేది ఈ రోజు నితీష్ నిర్ణయించారు. నితీష్ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల ఎమ్మెల్యేతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన నితీష్‌కుమార్.. ఆ తర్వాత రాజ్‌భవన్ వెళ్లారు. […]
ఎన్డీఏ కూటమిలోని జేడీయూకు బీజేపీ కన్నా సీట్లు తక్కువ రావడంతో బిహార్ సీఎం ఎవరు అవుతారన్న చర్చకు ఫుల్‌స్టాఫ్ పడింది. బిహార్ సీఎంగా మళ్లీ నితీష్‌కుమారే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. జేడీయూకు సీట్లు తక్కువగా వచ్చినా పొత్తు ధర్మం పాటిస్తూ ముందుగా అనుకున్న ప్రకారం నితీష్‌కుమార్ నేతృత్వంలోనే బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ అగ్రనాయకత్వంతోపాటు బిహార్ నేతలు కూడా నితీష్‌కే జై కొట్టారు. నితీష్ స్థానాన్ని […]
కలగూరగంప రాజకీయాలంటూ కొన్నేళ్ల క్రితం కూటమి ప్రభుత్వాలను కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బీహార్‌ని చూస్తే అవి ప్రస్ఫుటం అవుతాయి. ఏపీ అసెంబ్లీలో 3 పార్టీలున్నాయి. తెలంగాణా అసెంబ్లీలో కూడా అంతే. కానీ ఇప్పుడు బీహార్ లో ఏకంగా 12 పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ కూడా గెలిచారు. దాంతో ఇక్కడ అధికారం పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాకి ఒక్క సీటు తేడాలో ఆగిపోయిన బీజేపీ తన బలాన్ని నిరూపించుకునే […]
ఈ నెల 7వ తేదీన బిహార్ మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రచారం కూడా ముగిసింది. పదునైన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష కూటములు ప్రచార పర్వాన్ని రక్తి కట్టించాయి. మాటల యుద్ధంతో రణరంగాన్ని తలపించాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అధికార పక్షం చెప్పే మాటలకు ప్రతిపక్షం, ప్రతిపక్షం చెప్పే మాటలకు అధికార పక్షం కౌంటర్ ఇస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటాయి. కానీ బిహార్ ఎన్నికలలో ఓ […]
బిహార్ ఎన్నికల్లో నడుస్తోన్న పొత్తు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, జేడీయూ కూటమి, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేస్తుండగా ఎల్ జె పి.. జేడీయూతో విభేధించి ఒంటరిగా పోటీలో నిలిచింది. మూడు దశల్లో జరగాల్సిన బిహార్ ఎన్నికల్లో తొలి దశ పూర్తయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ ప్రచారం సాగుతోంది. ఆయ పార్టీల రాజకీయ నాయకుల విమర్శలు, ప్రకటనలతో బిహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల ఎల్ జె పి చీఫ్ చిరాగ్ పాశ్వాన్ […]