Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఇతర ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అతిక్రమించి ఎవరైనా పోటీలో ఉన్నా.. బి.ఫారం ఇవ్వకూదని వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రీజనల్ కో ఆర్డినేటర్లు ఆదేశాలు జారీ చేసింది.
పార్టీలో అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం ప్రారంభం నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు దక్కేలా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇందులో భాగంగా జడ్పీటీసీ సీట్లు కొత్త వారికి, యువతకు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తామని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంటే.. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, మున్సిపల్ చైర్మన్, మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కని వారికి ఆ తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు.