Idream media
Idream media
జబర్దస్త్ నాగబాబు కాస్త అదిరింది నాగబాబు అయ్యారు. సినీ నటుడు, రాజకీయ నాయకుడిగా కంటే నాగబాబు.. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. నాలుగు రూపాయలు వెనకేసుకున్నారు. అది వేరే విషయం. ప్రస్తుతం విషయం ఏమిటంటే.. అదిరింది షోకు న్యాయ నిర్ణేతగా ఉన్న నాగబాబు.. జబర్దస్త్ షోలో తీర్పులు చెప్పినట్లుగా.. తన సోదరుడు చిరంజీవి తరఫున రాజకీయ వ్యవహారంపై వకల్తా పుచ్చుకున్నారు. కుటుంబ, లేదా వ్యక్తిగతమైతే నాగబాబు కల్పించుకున్నా ఫర్వాలేదు కానీ అది రాజకీయ వ్యవహారం.
చిరంజీవి రాజ్యసభకు వెళతారంటూ కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీ చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తుందని ప్రతికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నాగబాబు తాజాగా స్పందించారు. తన అన్న చిరంజీవిని ఓ పార్టీ రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారంలో నిజంలేదన్నారు. మెగా అభిమానుల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవికి ప్రస్తుతం జనసేనతో సహా ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.
తనను రాజ్యసభకు పంపిస్తార్న ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకూ స్పందించలేదు. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చిరంజీవి దంపతులు జగన్‌ను కలిశారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు బహిరంగంగా మద్ధతు ప్రకటిస్తున్నారు. మూడు రాజధానులను స్వాగతించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్‌తో తాను మాట్లాడానని సినీ పరిశ్రమ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి రాజకీయ వ్యహారాల్లోపై ఆసక్తి చూపారు. అలాంటిది చిరంజీవికి రాజ్యసభ సీటు..అంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు ఎలా స్పందిస్తారనేదే ప్రశ్న. నాగబాబు ఏ పార్టీలో లేకుండా ఉన్నట్లైతే చిరంజీవి తరఫున వకాల్తా పుచ్చుకున్నా ఫర్వాలేదు కానీ ఆయన ప్రస్తుతం ఆయన జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఏ పార్టీతోనూ చిరంజీవికి సంబంధంలేదంటూనే.. జనసేన నాయకుడైన నాగబాబు స్వతంత్రుడైన చిరంజీవి తరఫున ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా జరుగుతున్న ప్రచారం జనసైనికుల్లో గందరగోళం సృష్టించేందుకేన్నారు. చిరంజీవి జనసేనతోనే కాదు ఏ పార్టీకి సంబంధం లేనప్పుడు జనసైనికులు ఎందుకు ఆందోళన పడతారు..? ఈవిషయంలో నాగబాబు తన సోదరుడు చిరంజీవితో ప్రకటన చేయిస్తే దానికి అర్థం, విలువ ఉంటుంది. ఆ దిశగా నాగబాబు ఆలోచన చేస్తారా..?