లోక్ అదాలత్ లో అరుదైన దృశ్యం.. భార్య కాళ్లు మొక్కి భావోద్వేగానికి లోనై..

భార్యాభర్తల బంధమన్నాక చిన్న చిన్న గొడవలు, అలకలు మామూలే. ఇద్దరిలోను సర్థుకుపోయే గుణం ఉంటే ఆ భార్యాభర్తల బంధం ఆదర్శవంతంగా ఉంటుంది. అలా కాకుండా ఇగోలకు గొడవలు పెద్దవి చేసుకుంటే సంసారంలో నిప్పులు పోసుకున్నట్టే అవుతుంది. అయితే సాఫీగా సాగుతున్న వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. మధ్యానికి అలవాటనడిన తన భర్త తరచ గొడవపడి చేయి చేసుకుంటుండంతో విసిగెత్తి పోయింది. ఎన్ని విధాలుగా అతడిని మార్చాలని చూసిన అతడిలో మాత్రం మార్పు రాలేదు. ఇక చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మధ్యం మత్తులో రోజు గొడవపడుతున్నాడంటూ కంప్లైంట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత కేసు రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్ ను సంప్రదించారు. అక్కడ ఈ కేసు విషయంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా భార్య కాళ్లను మొక్కి భావోద్వేగానికి గురయ్యాడు ఓ భర్త. ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన గోవింద్‌కు రాజేశ్వరి అనే మహిళతో కొన్నేళ్ల క్రిత్రం వివాహమైంది. కాగా గోవింద్ డ్రైవర్ వృత్తిని చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతడికి మధ్యం తాగుడు అలవాటైంది. దీంతో గోవిందు తాగిన మైకంలో తరుచూ తన భార్యతో గొడవపడి చేయి చేసుకునేవాడు. అలా కొన్నాళ్లు భరించిన ఆమెకు ఓపిక నశించింది. చివరికి రాజేశ్వరి గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల‌ తరువాత ఆ కేసు రాజీ కొరకు జాతీయ లోక్ అదాలత్‌కు చేరింది.ఈ లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె కుషాతో పాటు జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి అన్నీరోజ్ క్రిస్టియన్, సీనియర్ సివిల్ జడ్జి గంటా కవిత, జూనియర్ సివిల్ జడ్జి ఉదయ్ నాయ‌క్ వారికి నచ్చజెప్పారు.

ఆ తర్వాత వీరి సమక్షంలో ఈ దంపతులు కలిపి దండలను మార్చుకున్నారు. ఆ క్రమంలో గోవింద్‌ భావోద్వేగానికి గురయ్యాడు. తాగిన మైకంలో తన భార్యను కొడుతుండడం, దూషించడం పొరపాటేనని ఒప్పుకున్నాడు. దీంతో న్యాయమూర్తులు ఆమెకు క్షమాపన చెప్పాలని కోరగా సారే కాదు.. కాళ్లే మొక్కుతానని తన భార్య కాళ్ళకు మొక్కాడు.దీంతో అక్కడ సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులకు మించి తన భార్య తనను చూసుకుంటుందని ఇక ముందు ఆమెతో గొడవపడనని చెప్పాడు. దీంతో అక్కడున్న వారందరు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

Show comments