iDreamPost
android-app
ios-app

ప్రియుడి మోజులో భార్య దారుణం.. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను..

  • Published Nov 13, 2024 | 12:39 PM Updated Updated Nov 13, 2024 | 12:39 PM

వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడి మోజులో పడి భార్య దారుణానికి ఒడిగట్టింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడి మోజులో పడి భార్య దారుణానికి ఒడిగట్టింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

  • Published Nov 13, 2024 | 12:39 PMUpdated Nov 13, 2024 | 12:39 PM
ప్రియుడి మోజులో భార్య దారుణం.. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను..

పరాయి వ్యక్తులపై వ్యామోహంతో కాపురాలను కూల్చుకుంటున్నారు. భర్త ఉండగానే ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రియుడి మోజులో పడి ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకు భర్తను కడతేర్చేందుకు కూడా వెనకాడడం లేదు. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అందం, ఆస్తుల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుని జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను అంతమొందించింది. ప్రియుడి, కుమారుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది. ఏకంగా చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త ప్రాణాలు తీసింది. ఈ ఘటన అనంతపూర్ లో చోటుచేసుకుంది.

కాగా ఈ ఘటన 2023లో చోటుచేసుకోగా ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. అసలు ఏం జరిగిందంటే.. మోహన్ కుమార్, కవిత ఇద్దరు భార్యాభర్తలు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కవిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుమారుడు కౌశిక్‌, కుమార్తె దీక్షితతో కలిసి తుమకూరులో ఉంటోంది. కాగా కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలో పనిచేసే విద్యుత్‌శాఖ జేఈగా పని చేసే అక్తర్‌పాషాతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి సాయంతో తుమకూరులోనే ఓ హోటల్‌ పెట్టింది. ఈ క్రమంలో భర్త మోహన్‌కుమార్‌ పలుసార్లు హోటల్‌ వద్దకు వెళ్లి భార్య కవిత, ప్రియుడు అక్తర్‌పాషా, కుమారుడు కౌశిక్‌ను దూషించేవాడు. తన ఆస్తిని మీకు ఇవ్వనని, తన సోదరులకు ఇస్తానని గొడవ పడేవాడు.

భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన కవిత అతన్ని చంపేందుకు ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో భార్య కవిత, కుమారుడు కౌశిక్‌, ప్రియుడు అక్తర్‌పాషాలు మోహన్‌కుమార్‌ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికి హోటల్‌ వంట మనిషి మోహన్‌ప్రసాద్‌తో సుపారీ మాట్లాడారు. రూ.లక్షకు ఒప్పందం చేసుకొని రూ.50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. పథకం ప్రకారం కూతురుకు ఆరోగ్యం బాలేదని మోహన్ కుమార్ ను 2023 జనవరి 11న రాత్రి ఇంటికి పిలిపించింది. బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. మోహన్ కుమార్ మత్తులోకి వెళ్లాక భార్య కవిత, కుమారుడు కౌశిక్‌, వంట మనిషి మోహన్‌ప్రసాద్‌… మోహన్‌కుమార్‌ తలపై రోకలిబండతో కొట్టారు. కవిత ప్రియుడు అక్తర్‌పాషా కత్తితో గొంతుకోశారు.

ఆ తర్వాత శవాన్ని ఓ ప్లాస్టిక్‌ సంచిలో కట్టి వంట మనిషి ఓ కారులో వేసుకుని మడకశిర మండలంలోని కోడిగానిపల్లి హంద్రీనీవా కాలువ బ్రిడ్జి కింది భాగాన పడేసి వెళ్లారు. కాగా జనవరి 12న గుర్తు తెలియని శవాన్ని గుర్తించి వీఆర్‌ఓ హారతి స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్‌కుమార్‌ (52) తప్పిపోయినట్లు 2023 జనవరి 21న జయనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలను మడకశిర పోలీసులు సేకరించారు.

ఆ తర్వాత శవం ఫొటోను నాగరత్నమ్మకు చూపించగా మృతుడు తన పెద్ద కుమారుడేనని గుర్తు పట్టింది. మృతుడి తల్లి, సోదరుల విచారణలో భార్యాభర్తల మధ్య వివాదాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఆధారంగా భార్య కవితను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. మోహన్ కుమార్ హత్య కేసులో నిందితులైన కవిత, అక్తర్‌పాషా, కౌశిక్‌, మోహన్‌ప్రసాద్‌లను తుమకూరులో అరెస్ట్‌ చేశారు. మరి ప్రియుడి మోజులో భర్తను చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş