iDreamPost
android-app
ios-app

స్నేహం ముసుగులో ఘోరం.. ఒకరి భార్యతో మరొకరు.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 18, 2024 | 6:12 PM Updated Updated Nov 18, 2024 | 6:12 PM

అక్రమ సంబంధాలకు కుటుంబాలు బలైపోతున్నాయి. మనుషులం అన్న సంగతి మరిచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చివరకు ఏం జరిగిందంటే?

అక్రమ సంబంధాలకు కుటుంబాలు బలైపోతున్నాయి. మనుషులం అన్న సంగతి మరిచి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 18, 2024 | 6:12 PMUpdated Nov 18, 2024 | 6:12 PM
స్నేహం ముసుగులో ఘోరం.. ఒకరి భార్యతో మరొకరు.. చివరకు ఏం జరిగిందంటే?

సమాజంలో విచ్చలవిడి తనం ఎక్కువైపోతున్నది. వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సుఖాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందం, ఆస్తుల కోసం పరాయి వ్యక్తులపై మోజు పడి కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల వల్ల సంసారాలు కూలిపోతున్నాయి. పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తను, లేదా భార్యను చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భార్య, ప్రియురాలి మోజులో పడి భర్త దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే పిల్లలను సైతం కడతేర్చేందుకు వెనకాడడం లేదు. భర్త పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్తున్న ఘటనలు కూడా ఉన్నాయి.

ఇలాంటి దారుణాలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి. స్నేహం ముసుగులో వివాహేతర సంబంధాలు పెట్టుకుని హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితులు ఒకరి భార్యతో మరోకరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని చివరకు వారిద్దరు లోకాన్ని విడిచి వెళ్లారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. వారిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కూడా బిజినెస్ దిగ్గజాలు. ఒకరి భార్యతో మరొకరు ఇల్లీగల్ కాంటాక్టులు పెట్టుకున్నారు. చివరకు ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. మరో వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఈ ఘోరం జరగడానికి గల కారణం ఇప్పుడు చూద్దాం. కర్ణాటకకు చెందిన వినాయక్ నాయక్ , గురు ప్రసాద్ ఇద్దరు బాల్యం నుంచే స్నేహితులు. ఒకరు మద్యం వ్యాపారంలో , మరొకరు ఎలక్ట్రిక్ గూడ్స్ వ్యాపారంలో కోట్లకు పడగలెత్తారు. కోటీశ్వరులయ్యారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లుగా సాగుతోంది.

ఇద్దరు అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. సొంతూళ్లలో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. కాలక్రమేన వారి స్నేహ బంధం పక్కదారి పట్టింది. సభ్య సమాజం తలదించుకునేలా వారు ఒకరి భార్యతో ఒకరు అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నారు. అది బట్టబయలైంది. జనం చీకొట్టారు. అయినా అదేమీ పట్టించుకోలేదు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఈ క్రమంలో వినాయక్ నాయక్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన్ని కిరాతకంగా చంపేశారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి లభించిన ఆధారాలతో విచారణ మొదలు పెట్టారు. సుపారి తీసుకుని ఈ హత్యకు పాల్పడిన వారు గోవాకు పారిపోయినట్టు గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత ముగ్గురు కిరాతకులను అదుపులోకి తీసుకున్నారు.

వారంతా గురు ప్రసాద్ ముఖ్య అనుచరులని పోలీసులు తేల్చారు. విషయం తెలిసిన పోలీసులు గురు ప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే పోలీసులకు గోవాలోని మాన్వీ నదిలో గురు ప్రసాద్ శవం బయటపడినట్లుగా సమాచారం వచ్చింది. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల స్నేహ బంధానికి మచ్చ రావడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరి భార్యతో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకుని ఒకరు హత్యకు గురై మరొకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio