iDreamPost
android-app
ios-app

ప్రియుడితో పీకల్లోతు ప్రేమ.. భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్లో పాయిజన్ ఇచ్చి..

  • Published Oct 26, 2024 | 11:20 AM Updated Updated Oct 26, 2024 | 11:20 AM

పరాయి వ్యక్తులపై వ్యామోహం కాపురాలు కూలిపోయేలా చేస్తుంది. ప్రేమ, అక్రమసంబంధాల పేరిట దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ మహిళ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి భర్తను హతమార్చింది.

పరాయి వ్యక్తులపై వ్యామోహం కాపురాలు కూలిపోయేలా చేస్తుంది. ప్రేమ, అక్రమసంబంధాల పేరిట దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ మహిళ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి భర్తను హతమార్చింది.

  • Published Oct 26, 2024 | 11:20 AMUpdated Oct 26, 2024 | 11:20 AM
ప్రియుడితో పీకల్లోతు ప్రేమ.. భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్లో పాయిజన్ ఇచ్చి..

అన్యోన్యంగా జీవించాల్సిన దంపతుల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మీద మోజు పచ్చని సంసారాల్లో అగ్గిరాజేస్తున్నాయి. సుఖాల కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. వావి వరుసలు మరిచి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియుడి మోజులో పడి లేదా ప్రియురాలి మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. దాంపత్య జీవితానికి బీటలువారుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రియుడిపై వ్యామోహంతో భర్తలను హతమారుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. సినిమాల ప్రభావమో, లేదా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ భార్యాభర్తల బంధంలో అలజడి సృష్టిస్తోంది.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. ఆ తర్వాత చనువు పెరిగి అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ అక్రమ సబంధానికి అడ్డు తొలగించుకునేందుకు కట్టుకున్న భర్తను కాటికి పంపిస్తున్నారు కొంతమంది భార్యలు. ఇదే తరహాలో కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఓ మహిళ భర్త అడ్డు తొలగించుకునేందుకు సినిమా స్టైల్లో ప్లాన్ చేసింది. భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి హతమార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలోని కర్కాలకు చెందిన ప్రతిమ బ్యుటీషియన్ గా పనిచేస్తుంది. ఈమె ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటూ రీల్స్ చేస్తుంది.

ఈ క్రమంలో ఇన్ స్టాలో దిలీప్ హెగ్డేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ కాస్త అక్రమసంబంధానికి దారితీసింది. ప్రియుడిపై మోజుతో భర్త బాలకృష్ణ పూజారిని అడ్డుతొలగించుకోవాలనుకుంది ప్రతిమ. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్ చేసింది. భర్తకు ఆహారంలో విషం కలిపి పెట్టడం స్టార్ట్ చేసింది. ఇలా స్లోపాయిజన్ ఇస్తూ భర్త ఆరోగ్యం క్షీణించిపోయేలా చేసింది. స్లోపాయిజన్ కారణంగా అతని ఆరోగ్యం నెమ్మది నెమ్మదిగా బలహీన పడింది. ఎవరికీ అనుమానం రాకుండా చికిత్స చేయిస్తున్నట్లు ఆసుపత్రుల చుట్టూ తిప్పింది. బాలకృష్ణ గత 25 రోజులుగా జ్వరం, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

ఎవరికీ అనుమానం రాకుండా తన భర్తకు కామెర్లు ఉన్నాయని భార్య నమ్మబలికింది. దీంతో అతడిని కర్కలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా బాలకృష్ణ అక్టోబర్ 20న మృతి చెందాడు. బాలకృష్ణ మృతిపై ఆయన సోదరుడు రామకృష్ణ, ప్రతిమ సోదరుడు సందీప్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ప్రతిమ ను నిలదీశారు. ఈ క్రమంలో తన సోదరుడు సందీప్ ముందు భర్తను హత్య చేసినట్లు ప్రతిమ అంగీకరించింది. దిలీప్ సహాయంతో తాను బాలకృష్ణను బెడ్ షీట్ తో గొంతు నులిమి చంపానని చెప్పింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ప్రతిమను, దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరి ప్రియుడిమోజులో పడి భర్తకు స్లోపాయిజన్ ఇచ్చి మట్టుబెట్టిన భార్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet