iDreamPost
android-app
ios-app

గుండెల్ని మెలిపెట్టే ఘటన.. ఒకే ఆస్పత్రిలో.. తండ్రి మరణం.. కుమారుడు జననం

కొన్ని సంఘటనలు తలుచుకుంటేనే ప్రాణం పోయేలా ఉంటుంది. ఇదే రీతిలో ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణించగా.. కాసేపటికే అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి వేస్తుంది.

కొన్ని సంఘటనలు తలుచుకుంటేనే ప్రాణం పోయేలా ఉంటుంది. ఇదే రీతిలో ఒకే ఆస్పత్రిలో తండ్రి మరణించగా.. కాసేపటికే అతని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించి వేస్తుంది.

గుండెల్ని మెలిపెట్టే ఘటన.. ఒకే ఆస్పత్రిలో.. తండ్రి మరణం.. కుమారుడు జననం

విధిరాతను తప్పించడం ఎవరి తరం కాదు కదా. కష్ట సుఖాలను అనుభవించాల్సిందే.. చివరాఖరకు మట్టిలో కలవాల్సిందే. ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతాయి. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వారు ప్రమాద బారిన పడి మృత్యు ఒడిలోకి చేరుతుంటారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అధిక స్పీడుతో బైక్ లను నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కొందరు తీవ్ర గాయాలతో బయటపడుతుంటే.. మరికొందరేమో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఓ బైక్ ప్రమాదం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.

ఓ యువకుడు బైక్ పై వెళ్తూ అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. అయితే ఇక్కడ హృదయాలను కదిలించే విషయం ఏంటంటే?.. ఆ యువకుడు మృది చెందిన కాసేపటికే అతని భార్య పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒకే హాస్పిటల్ లో ఓ వైపు తండ్రి మరణం.. మరో వైపు కొడుకు జననంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణణాతీతం. విధి ఆడిన వింత నాటకం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గుండెల్ని మెలిపెట్టే ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజో ళి మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన శివ (28)కు, ఏపీ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా బలపాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో 14 నెలల కిందట వివాహమైంది.

ఆమె నిండు గర్భిణీ. వారసుడొస్తాడని ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. కానీ విధి వారి ఆనందానికి అడ్డుపడింది. కాగా మంగళవారం శివ తుమ్మలపల్లె నుంచి రాజోళికి వెళ్తున్న క్ర మంలో బైక్‌ అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే శివను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే శివ భార్య లక్ష్మితో పాటు కుటుంబసభ్యులు హాస్పిటల్ కు చేరుకున్నారు. ప్రమాదంలో శివ తీవ్రంగా గాయపడడంతో ఆరోగ్యం విషమించింది. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శివ మృతి చెందాడు. తర్వాత గంట సమయంలోనే నిండు గర్భిణి అయిన శివ భార్య పురిటి నొప్పులతో అదే ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఓ వైపు భర్త మరణం.. మరోవైపు కొడుకు జననంతో లక్ష్మీ మూగ రోధన అందరి కంట కన్నీరు తెప్పించింది. భర్త చనిపోయాడని బాధపడాలో.. అతనికి ప్రతిరూపంగా జన్మించిన కొడుకును చూసి మురిసిపోవాలో తెలియని దయనీయస్థితిలో లక్ష్మి పడిన వేదన అంతా ఇంతా కాదు. ఆమెను ఓదార్చడం ఎవరీతరం కాలేదు. పుట్టిన కొడుకును చూసుకునే అదృష్టం తండ్రికి లేకుండా పోయిందని కుటుంబసభ్యులు దిక్కులు పిక్కటిల్లేలా రోధించారు. కొడుకును చూడకుండా తండ్రి అనంతలోకాలకు చేరితే.. భర్త అంత్యక్రియల్లో పాల్గొనలేని దుస్థితి ఆ భార్యది. ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదంటూ ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.