iDreamPost
android-app
ios-app

మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి పరార్.. భర్త ఎంట్రీతో.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 01, 2024 | 11:22 AM Updated Updated Nov 01, 2024 | 11:22 AM

ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలసి పారిపోయేందుకు రెడీ అయ్యింది. ఇంతలోనే ఆమె భర్త ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఆమె భర్త సీఆర్పీఎఫ్ జవాన్ కావడం గమనార్హం.

ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలసి పారిపోయేందుకు రెడీ అయ్యింది. ఇంతలోనే ఆమె భర్త ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది. ఆమె భర్త సీఆర్పీఎఫ్ జవాన్ కావడం గమనార్హం.

  • Published Nov 01, 2024 | 11:22 AMUpdated Nov 01, 2024 | 11:22 AM
మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి పరార్.. భర్త ఎంట్రీతో.. చివరకు ఏం జరిగిందంటే?

సమాజంలో రోజు రోజుకు మానవతా విలువలు మంటకలిసిపోతున్నాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వారు ఆ బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. పరాయి వ్యక్తి మోజులో పడి వైవాహిక బంధానికి మచ్చ తెస్తున్నారు. కష్టమైనా సుఖమైనా నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సింది పోయి వివాహేతర సంబంధాల కారణంగా విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. కాపురాలను కూలుస్తున్నాయి. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అందం, ఆస్తులను చూసి పరాయి వ్యక్తులతో అక్రమసంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో భర్త లేదా భార్యా పిల్లలను వదిలి వెళ్తున్న వాళ్లను కూడా చూస్తున్నాం.

వివాహేతర సంబంధాల కారణంగా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇదేరీతిలో ఓ మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. సీఆర్పీఎఫ్ భర్తను కాదని ప్రియుడితో కలిసి పరార్ అయ్యేందుకు రెడీ అయ్యింది. మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఇదే సమయంలో ఆమె భర్త ఎంట్రీ ఇచ్చాడు. పారిపోతున్న వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దాడికిపాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది. బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పాట్నా రైల్వే స్టేషన్ కు వచ్చింది.

తన భార్య మరో వ్యక్తితో పరార్ అవుతున్న విషయం తెలిసి వెంటనే రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. భార్య ఆమె ప్రియుడిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోతు తన భార్య ప్రియుడిపై విరుచుకుపడ్డాడు. భార్య ముందే ప్రియుడిపై పిడిగుద్దులు కురిపించాడు. తన భర్త నుంచి ప్రియుడిని విడిపించుకునేందుకు ఆ మహిళా కానిస్టేబుల్ విశ్వ ప్రయత్నం చేసింది. అయినా ఆమె ప్రియుడిని విడిచిపెట్టకుండా దాడికి దిగాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నం చేసినా భార్య ప్రియుడిని వదల్లేదు. అతని దెబ్బలు తాళలేకపోయిన ఆ ప్రియుడి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది.

ఇక దాడి అనంతరం సీఆర్పీఎఫ్ భర్త తన భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె మాత్రం వెళ్లలేదు. బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉన్న మహిళా కానిస్టేబుల్ పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్పీఎఫ్ భర్తను కాదని ప్రియుడితో పారపోయేందుకు రెడీ అయిన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్లేవారికి బుద్ది చెప్పాల్సిన మహిళా కానిస్టేబుల్ ఇలా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ప్రియుడితో కలిసి మహిళా కానిస్టేబుల్ పరారైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet