iDreamPost
android-app
ios-app

క్రైమ్ ని ఛేజ్ చేసే ‘హిట్’

  • Published Feb 19, 2020 | 7:58 AM Updated Updated Feb 19, 2020 | 7:58 AM
  • Published Feb 19, 2020 | 7:58 AMUpdated Feb 19, 2020 | 7:58 AM
క్రైమ్ ని ఛేజ్ చేసే ‘హిట్’

న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మాణమైన హిట్ మూవీ ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిలసౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కథలోని పాయింట్ గురించి ఇందులోనే రివీల్ చేశారు. నగర శివార్లలో ప్రీతీ అనే టీనేజ్ అమ్మాయి తప్పిపోతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(HIT) ఆఫీసర్ విక్రమ్ వస్తాడు.

ప్రీతీ అంతకు ముందురోజు రాత్రి వెళ్లిన పబ్ నుంచి ఎంక్వయిరీ మొదలుపెడతాడు. కానీ అంతా పజిల్ లా ఉంటుంది. ఎక్కడికక్కడ కొత్త చిక్కుముడులు వస్తాయి. దానికి విక్రమ్ కో వ్యాధికి సంబంధించిన బలహీనత ఉంటుంది. అసలు ప్రీతీ ఏమైంది. విక్రమ్ హంతకుడిని పట్టుకున్నాడా లేదా లాంటి ప్రశ్నలతో ప్రేక్షకుడిని ఎక్కువ క్లూస్ ఇవ్వకుండా ట్రైలర్ ని కట్ చేశారు.

ఫలక్ నుమా దాస్ లో మాస్ గల్లీ లీడర్ గా నటించిన విశ్వక్ సేన్ ఇందులో మెచ్యూరిటీ ఉన్న పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను టేకింగ్ రేసీగా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి లైన్స్ తో కథలు వచ్చినప్పటికీ హిట్ ని మంచి ఇంటెన్సిటీతో తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం, మణికందన్ ఛాయాగ్రహణం థీమ్ ని ఎలివేట్ చేయడానికి దోహదపడ్డాయి. మురళి శర్మ, భానుచందర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా హిట్ లో ఉన్నారు. అదనంగా మంచి రొమాంటిక్ ట్రాక్ కూడా జోడించారు. సెన్సార్ కాలేదు కాబట్టి రెండు మూడు ద్వందార్థాలు ట్రైలర్ లో దొర్లాయి. మొత్తానికి హిట్ రూపంలో మంచి క్రైమ్ డ్రామాతో వస్తున్న విశ్వక్ సేన్ గట్టి హిట్టు కొట్టాడా లేదా అనేది మార్చ్ 28న తేలిపోతుంది.

Watch Trailer Here @ bit.ly/2SIEPW1

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom