iDreamPost
android-app
ios-app

The Paradise: పారడైజ్..క్లారిటీ ఇవ్వాల్సింది దర్శకుడే

  • Published Jun 25, 2026 | 5:20 PM Updated Updated Jun 25, 2026 | 5:20 PM

నాని పారడైజ్ సినిమా మీద ఒకటే గుసగుసలు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఆ సినిమా మరోసారి వాయిదా పడుతుందని, ఏకంగా డిసెంబర్ కు వెళ్లిపోతుందని. సరే, భారీ సినిమాలు వాయిదా పడడం పెద్ద విషయమూ కాదు. వింతా కాదు. కానీ అది కాదు అసలు విషయం. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు దాటేసింది అన్నది పాయింట్. నాని హీరోగా ఇప్పుడు టాప్ హీరోల స్టేజ్ కు వచ్చేసాడు. అందులో సందేహం లేదు. కానీ అలా అని 150 కోట్లకు పైగా బడ్జెట్ అంటే ఏమనుకోవాలి?

  • Published Jun 25, 2026 | 5:20 PMUpdated Jun 25, 2026 | 5:20 PM
The Paradise: పారడైజ్..క్లారిటీ ఇవ్వాల్సింది దర్శకుడే

నాని పారడైజ్ సినిమా మీద ఒకటే గుసగుసలు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఆ సినిమా మరోసారి వాయిదా పడుతుందని, ఏకంగా డిసెంబర్ కు వెళ్లిపోతుందని. సరే, భారీ సినిమాలు వాయిదా పడడం పెద్ద విషయమూ కాదు. వింతా కాదు. కానీ అది కాదు అసలు విషయం. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు దాటేసింది అన్నది పాయింట్. నాని హీరోగా ఇప్పుడు టాప్ హీరోల స్టేజ్ కు వచ్చేసాడు. అందులో సందేహం లేదు. కానీ అలా అని 150 కోట్లకు పైగా బడ్జెట్ అంటే ఏమనుకోవాలి?

దసరా సినిమా మంచి, సినిమా హిట్ సినిమా. అందులో కూడా సందేహం లేదు. కానీ ఆ సినిమా కొన్న బయ్యర్లు అందరూ గట్టెక్కలేదు. నిజానికి నాని సినిమాలకు క్రిటికల్ అప్లాజ్ వస్తోంది. కానీ చేస్తున్న బిజినెస్ మేరకు బయ్యర్లు గట్టెక్కడం బొటాబొటిగా వుంటోంది. హాయ్ నాన్న సినిమాను నాని నే కొనుక్కుని, వీలయినంత రీజనబుల్ గా పంపిణీ చేసుకున్నారు. ఆ తరువాత హిట్ సిరీస్ ను కూడా రీజనబుల్ గా మార్కెట్ చేసుకున్నారు. అందువల్ల సమస్య రాలేదు.

కానీ ఇప్పుడు 150 కోట్ల భారీ సినిమా అన్న తరువాత మార్కెట్ కూడా ఆ రేంజ్ కే చేయాల్సి వుంటుంది. అది ఎంత అన్నది విడుదల దగ్గరకు వచ్చిన తరువాత కానీ తెలియదు.

పారడైజ్ దర్శకుడు అటు బడ్జెట్, ఇటు మేకింగ్ ప్రాసెస్ ను రెండింటినీ కంట్రోలు చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఎంత క్వాలిటీ, పెర్ ఫెక్షన్ అన్నది కీలకం అయినా, టైమ్ కు విడుదల కావడం, బడ్జెట్ లో పూర్తి కావడం అన్నది అంతకన్నా కీలకం.

పారడైజ్ విషయంలో హీరో నాని పూర్తిగా దర్శకుడికి సరెండర్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద వున్న నమ్మకం అలాంటిది. ఇక నిర్మాత చెరుకూరి సుధాకర్ సంగతి సరేసరి. ఆయన కూడా దర్శకుడు ఎలా అంటే అలాగే.

ఇలాంటి నేపథ్యంలో వస్తున్న గుసగుసలు అన్నింటిపై క్లారిటీ ఇవ్వాల్సింది దర్శకుడు శ్రీకాంత్ నే. నాని ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా చేయాలని మూడేళ్ల నుంచి అనుకుంటున్నారు. కానీ కావడం లేదు. అసలు పారడైజ్ కు ఇంకా ఎంత వర్క్ పెండింగ్ వుంది. బడ్జెట్ ఏ మేరకు అవుతోంది ఇవన్నీ జనాలకు తెలియాలి అంటే దర్శకుడు శ్రీకాంత్ మాత్రమే చెప్పాలి. బడ్జెట్ గురించి కాకపోయినా వర్క్ గురించి, విడుదల గురించి చెబితే ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş