Heroines : హీరోయిన్ క్యారెక్టరైజేషనే అసలు సక్సెస్ మంత్రం

ఒకప్పుడు హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఎక్కువ వచ్చేవి కానీ కమర్షియల్ ఫార్ములా డామినేట్ చేసే ట్రెండ్ లో కథానాయికలకు ప్రాధాన్యం ఊహించుకోవడం కష్టమే. ఎంతసేపూ ఆడియన్స్ దృష్టి హీరో మీదే ఉంటుందనుకునే దర్శకులు తప్ప సరైన రీతిలో పాత్రలను రాసుకుని దానికి తగ్గ ఆర్టిస్టులను ఎంచుకుంటే విజయంలో వాళ్ళు ఎంత కీలక పాత్ర పోషిస్తారనే దానికి ఈ మధ్య కాలంలో వచ్చిన మూడు సినిమాలను చెప్పుకోవచ్చు. మొదటిది లవ్ స్టోరీ. సాయి పల్లవి బ్రాండ్, సారంగ దరియా పాటలో వేసిన స్టెప్పులు, ఫిదా తాలూకు ప్రభావం ఇంకా ఆడియన్స్ మైండ్ లో ఉండటం లాంటివి వసూళ్లలో గణనీయ పాత్ర పోషించాయన్నది వాస్తవం. దానికి యుట్యూబ్ వ్యూసే సాక్ష్యం.

అలా అని కేవలం సాయిపల్లవి ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని కాదు. యావరేజ్ కథ మెప్పించేలా ఉంటే తను అదనపు లాభం అవుతుందన్నది మాత్రం వాస్తవం. ఇక రెండోది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఫస్ట్ డే డివైడ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే 15 కోట్లకు పైగా రాబట్టడం కుటుంబ ప్రేక్షకులు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. పూజా హెగ్డే గ్లామర్ తో పాటు తన నటన కూడా ఎంత అడ్వాంటేజ్ అయ్యిందో చూసినవారు ఎవరినైనా అడగొచ్చు. ఇక డిజాస్టర్ అని రివ్యూలు తెచ్చుకున్న పెళ్లిసందడిలో కీరవాణి పాటలకు హీరోయిన్ శ్రీలీల గ్లామర్ తోడై పైసా వసూల్ చేయించింది.

దెబ్బకు రవితేజ ధమాకాలో ఆఫర్ తెచ్చేసుకుంది శ్రీలీల. మేకింగ్ వీడియోలు, టీజర్లు చూసే తనను లాక్ చేసుకున్నారు దర్శకుడు నక్కిన త్రినాథరావు. పైన చెప్పిన మూడు సినిమాలు లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి కేవలం హీరోల ఇమేజ్ ఆధారంగా కలెక్షన్లు తెచ్చినవి కావు. హీరోయిన్ల షేర్ కూడా సమానంగా ఉందని చెప్పాలి. దీన్ని బట్టి కరెక్ట్ గా క్యారెక్టరైజేషన్ ని రాసుకుంటే కనక తమ గ్లామర్ తో నటనతో కథానాయికలు ఎంతగా సినిమాలు నిలబెడతారో అర్థమవుతుంది. పైగా వీళ్ళ రాబోయే చిత్రాలకు క్రేజ్ రావడంలోనూ ఈ ఫలితాలు ప్రభావం చూపిస్తాయి. ఇంతకన్నా నిర్మాతలకు కావాల్సింది ఏముంటుంది

Also Read : Ananya Panday : ‘డ్రగ్స్’ జోక్స్ ఏంటో… ఇప్పుడు ఎరక్కపోయి ఇరుక్కుందిగా !

Show comments