iDreamPost
android-app
ios-app

Pooja Hegde: 100 కోట్ల దెయ్యం సినిమాలో పూజా హెగ్డే? హీరో ఎవరంటే?

  • Published Sep 11, 2024 | 4:05 PM Updated Updated Sep 11, 2024 | 4:05 PM

Pooja Hegde in Raghava Lawrence Kanchana 4: రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే దెయ్యం సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Pooja Hegde in Raghava Lawrence Kanchana 4: రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే దెయ్యం సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Sep 11, 2024 | 4:05 PMUpdated Sep 11, 2024 | 4:05 PM
Pooja Hegde: 100 కోట్ల దెయ్యం సినిమాలో పూజా హెగ్డే? హీరో ఎవరంటే?

చిత్ర పరిశ్రమలో హార్రర్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కొద్దిగా నవ్వించి, భయపెడితే చాలు.. ఆ సినిమాపై కాసుల వర్షం కురిపిస్తారు ఆడియెన్స్. ప్రస్తుతం అగ్ర కథానాయకలు కూడా ఈ రూట్ లోకే వస్తున్నారు. దెయ్యం సినిమాల పట్ల గ్లామర్ హీరోయిన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాశిఖన్నా, తమన్నా, హన్సిక, త్రిష హార్రర్  సినిమాలతో హిట్లు కొట్టిన వాళ్లే. తాజాగా ఈ బాటలోనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నడవబోతున్నట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే దెయ్యం సినిమాలో పూజ నటిస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా మరేదో కాదు.. సూపర్ హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ‘కాంచన 4’.

రాఘవ లారెన్స్.. గత కొంత కాలంగా డైరెక్షన్ పక్కనపెట్టి, సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ‘కాంచన 4’ సినిమాను తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ వైరల్ గా మారింది. కాంచన 4 మూవీలో హీరోయిన్ గా పొడుగుకాళ్ల సుందరి, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఇక పూజ ఇప్పటి వరకు హార్రర్ మూవీస్ లో నటించలేదు. కాగా.. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ అనే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో రాఘవ లారెన్స్ ‘హంటర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే తొలుత కాంచన 4లో నయనతారను అనుకున్నారట. కానీ.. ఏమైందో తెలీదు.. ఇప్పుడు ఆ ఛాన్స్ పూజా హెగ్డేకి వచ్చింది. అందమైన హీరోయిన్స్ ని తీసుకుని గ్లామర్ టచ్ ఇస్తూ.. ప్రేక్షకులను భయపెట్డడంలో సిద్ధహస్తుడు లారెన్స్. కాంచన సిరీస్ లో తొలి సినిమాగా 2007లో వచ్చిన ‘ముని’ మంచి విజయాన్ని సాధించింది. దాంతో దానికి సీక్వెల్ గా 2011లో ‘కాంచన’తో ఆడియెన్స్ ను భయపెట్టాడు. ఈ మూవీ తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి కొనసాగింపుగా 2015లో వచ్చిన ‘గంగా'(కాంచన 3) కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు కాంచన 4తో ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు రాఘవ లారెన్స్. మరి గత సినిమాల మాదిరే భయపెడతాడో.. లేదో.. చూడాలి. ఇక తొలిసారి హార్రర్ మూవీతో పూజా హెగ్డే రాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss