సోనియాగాంధీ పెద్ద మనసు

కరోనా ఆపత్కాలంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తన పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పేదలు కార్మికులు వలస కూలీల ఆదుకోవాలంటూ పలు సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసిన సోనియా గాంధీ.. ఇప్పుడు వారిని తమ శక్తి మేరకు ఆదుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు.

దేశంలో మూడో విడత లాక్ డౌన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుండగా..ఇప్పటికే వలస కార్మికులు, కూలీలను వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. మొదట్లో కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్ర ప్రభుత్వాల వినతి మేరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వాటికి శ్రామిక్ ప్రత్యేక రైలు అనే నామకరణం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది.

40 రోజులుగా చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడిన వలస కార్మికులు, కూలీలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చిన సోనియాగాంధీ వలస కూలీలు, కార్మికులు రైల్వే ఛార్జీలను భరిస్తామంటూ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కూలీలు, కార్మికులు, శ్రామికులు ప్రయాణించేందుకు అవసరమైన టికెట్ ఛార్జీలను చెల్లించాలంటూ రాష్ట్ర పిసిసి లకు ఆదేశాలు జారీ చేశారు. జాతీ నిర్మాణంలో కార్మికుల త్యాగాలు వెలకట్టలేనివని సోనియా కొనియాడారు.

Show comments