iDreamPost
2018లో వచ్చిన నయనతార కోకోకోకిలకు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్ లో ప్లాన్ చేసుకున్నారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇవి వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని గుర్తించిన నిర్మాతలు దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు.
2018లో వచ్చిన నయనతార కోకోకోకిలకు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్ లో ప్లాన్ చేసుకున్నారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇవి వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని గుర్తించిన నిర్మాతలు దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు.
iDreamPost
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం గట్టిగా పోరాడుతున్న జాన్వీ కపూర్ కొత్త సినిమా గుడ్ లక్ జెర్రీ నిన్న డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో వచ్చిన నయనతార కోకోకోకిలకు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్ లో ప్లాన్ చేసుకున్నారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇవి వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్ మీద వర్కౌట్ అవుతాయని గుర్తించిన నిర్మాతలు దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. తెలుగు తమిళ ఆడియన్స్ ఆల్రెడీ ఈ కథను చూసేసినప్పటికీ కొన్ని కీలక మార్పులు చేయడంతో మరోసారి ట్రై చేయొచ్చని అభిప్రాయం కలిగింది. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం
జెర్రీ(జాన్వీ కపూర్)పూర్తిపేరు జయకుమారి. తండ్రి చనిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాధ్యతలు నెత్తిమీద వేసుకుని వాళ్ళను పోషిస్తూ ఉంటుంది. అమ్మా చెల్లి ఆలనాపాలనా చూసుకునేందుకు మసాజ్ సెంటర్ లో ఉద్యోగమే తనకు ఉపాధి. ఈ క్రమంలో క్యాన్సర్ బారిన పడిన తన తల్లిని రక్షించుకునేందుకు జెర్రీకి పాతిక లక్షలు అవసరమవుతాయి. కానీ అంత డబ్బు ఎంత ప్రయత్నించినా దొరకదు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లై చేసే గ్యాంగ్ లో తనకు తెలియకుండానే భాగమవుతుంది. దీంతో మాఫియా ముఠాకు టార్గెట్ అవుతుంది. ఇంతకీ జెర్రీ ఈ చక్రవ్యూహంలో ఎలా చిక్కుకుంది, ఫైనల్ గా డబ్బుని సమకూర్చుకుందా లేదా అనేది సినిమాలో చూడాలి.
జెర్రీ పాత్రలో జాన్వీ చక్కగా ఒదిగిపోయింది. నటనపరంగా ఇచ్చిన ఛాలెంజ్ ని ఒరిజినల్ వెర్షన్ లో నయనతారతో మ్యాచ్ చేసి నార్త్ ఆడియన్స్ ని మెప్పించేలా పర్ఫెక్ట్ ఛాయస్ అయ్యింది. దర్శకుడు సిద్దార్థ్ సేన్ గుప్తా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. కొన్ని ముఖ్యమైన లాజిక్స్ ని లింక్స్ ని మిస్ చేసినప్పటికీ ఓవరాల్ గా కోకోకోకిల చూడని వాళ్లకు ఈ జెర్రీ నచ్చే అవకాశాలు ఎక్కువ. కామెడీ ట్రాక్స్ బాగానే పేలాయి కానీ డ్రగ్స్ గ్యాంగ్ క్యారెక్టరైజేషన్లలో లోపాల వల్ల కొన్ని ఎపిసోడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యింది. ఒరిజినల్ వెర్షన్ చూసుండకపోతే కామెడీ టైంపాస్ కోసం జెర్రీ మీద హ్యాపీగా ఓ లుక్ వేయొచ్చు