iDreamPost
android-app
ios-app

దేవరతో జాన్వీ పై దెబ్బ.. ఇక ఆశలన్నీ బుచ్చి బాబుపైనే

  • Published Oct 01, 2024 | 1:39 PM Updated Updated Oct 01, 2024 | 1:39 PM

Janhvi Kapoor: దేవర సినిమా థియేటర్స్ లో రఫ్ ఆడిస్తుంది. ఎక్కడ చూసిన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ యాక్టింగ్ గురించే బజ్ వినిపిస్తుంది. మరి జాన్వీ సంగతేంటి.. శ్రీదేవి నటవారసురాలిగా ప్రూవ్ చేసుకుందా లేదా.. బుచ్చిబాబుతో సినిమా ఎలా ఉండబోతుంది. ఆ వివరాలు చూసేద్దాం.

Janhvi Kapoor: దేవర సినిమా థియేటర్స్ లో రఫ్ ఆడిస్తుంది. ఎక్కడ చూసిన మ్యాన్ ఆఫ్ ది మాసెస్ యాక్టింగ్ గురించే బజ్ వినిపిస్తుంది. మరి జాన్వీ సంగతేంటి.. శ్రీదేవి నటవారసురాలిగా ప్రూవ్ చేసుకుందా లేదా.. బుచ్చిబాబుతో సినిమా ఎలా ఉండబోతుంది. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Oct 01, 2024 | 1:39 PMUpdated Oct 01, 2024 | 1:39 PM
దేవరతో జాన్వీ పై దెబ్బ..  ఇక ఆశలన్నీ బుచ్చి బాబుపైనే

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్. ఇక డ్యాన్స్ గురించి వేరే చెప్పాలా.. థియేటర్స్ ఎరుపెక్కేశాయి. కొరటాల కథతో మెప్పించేశాడు. ఇలా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఇలాంటి టాక్ ఏ వినిపిస్తుంది. ఇదంతా సరే మరి మొదటి సారి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ సంగతేంటి. ఇండస్ట్రీకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మీద మాత్రమే ప్రేక్షకులు అంచనాలను పెట్టుకుంటారు. దేవర రిలీజ్ కు ముందు అలాంటి అంచనాలే జాన్వీ మీద కూడా ఉన్నాయి. కానీ రిలీజ్ తర్వాత ఎందుకో ఫ్యాన్స్ జాన్వీ విషయంలో శాటిస్ఫై అయినట్లు ఎక్కడా కనిపించడం లేదు. దేవర సినిమా జాన్వీకి ప్లస్ అవుతుంది అనే జాన్వీ కోరిక కూడా తీరలేదు.. కనీసం బుచ్చిబాబుతో అయినా ఇది తీరుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడమే ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. సో ఈ మూవీ కచ్చితంగా జాన్వీ కెరీర్ ను డిసైడ్ చేస్తుందని ప్రేక్షకులు భావించారు. రిలీజ్ కు ముందు జరిగిన ప్రమోషనల్ కంటెంట్ లో కూడా జాన్వీ గురించి అంత టాక్ రాలేదు. సరే రెండు నిమిషాల ట్రైలర్ ను బట్టి జాన్వీ క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేము కాబట్టి.. రిలీజ్ తర్వాత చూద్దాం అనుకున్నారు. తీరా ఇక్కడ కూడా ఈ అమ్మడి గురించి అంత టాక్ ఏమి రావడం లేదు. ఎదో తంగం పాత్రను చూపించాలి కాబట్టి అలా కాసేపు చూపించారు అన్నట్లుగానే ఉంది. దీనితో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందిన మాట వాస్తవమే. ఇక అటు జాన్వీ కూడా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుందాం అనుకుంది. కానీ అది జరగలేదు.  దేవర-2 లో మాత్రం తంగం పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడు పార్ట్-1 చూసిన తర్వాత.. ఆ అంచనాలు కూడా తగ్గిపోయాయి. దీనితో ఇప్పుడు జాన్వీ ఆశలన్నీ చరణ్- బుచ్చి బాబు కాంబోలో వస్తున్న RC-16 పైనే ఉన్నాయి.

దేవర సినిమా కంటే ముందే ఈ అమ్మడు.. RC-16 లో ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది. దేవరలో అంతగా మెప్పించకపోవడంతో.. మరి రామ్ చరణ్ సినిమాలో అయినా నటనకు ఆస్కారం ఉండే పాత్రం దొరుకుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది. మరి ఈ సినిమా అయినా జాన్వీకి మంచి హిట్ అందిస్తుందో లేదో చూడాలి. శ్రీదేవి నటవారసులుగా జాన్వీ ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది బుచ్చి బాబు మూవీతో డిసైడ్ అవుతుంది. నిజానికి ఇది జాన్వీకి సెకండ్ ఛాన్స్. మరి ఈసారి ఏమౌతుందో.. టాలీవుడ్ లో జాన్వీ కెరీర్ ఎలా ఉంటుందో.. టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాలనే జాన్వీ కోరిక తీరుతుందో లేదో చూడాలి. మరి ఈ విషయంపై పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş