iDreamPost
android-app
ios-app

రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘దేవర’.. NTR ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌

  • Published Oct 13, 2024 | 3:12 PM Updated Updated Oct 13, 2024 | 3:12 PM

Devara Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చాలా ఏళ్ల తర్వాత సోలోగా నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా భారీ వసూళ్ళు రాబడుతుంది.

Devara Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చాలా ఏళ్ల తర్వాత సోలోగా నటించిన ‘దేవర’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా భారీ వసూళ్ళు రాబడుతుంది.

  • Published Oct 13, 2024 | 3:12 PMUpdated Oct 13, 2024 | 3:12 PM
రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘దేవర’.. NTR ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్‌

కొరటాల దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందించిన సినిమా ‘దేవర’. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయదశమి పండుగకు ముందే వచ్చిన దేవర మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్ల వసూళ్లు మొదలయ్యాయి. దానికి తోడు దసరా సెలవులు కూడా తొడయ్యాయి. ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ఎన్టీఆర్ కెరీర్ లో మరో రేర్ రికార్డు నమోదయ్యింది. గత నెల 27న రిలీజ్ అయిన ‘దేవర’ మొదటి రోజే 172 కోట్ల వసూళ్లు రాబట్టి రెండవ రోజు రూ.243 కోట్లకు చేరింది. కొన్నేళ్ల తర్వాత సోలో హీరోగా నటించడంతో అభిమానులు దేవర మూవీకి బ్రహ్మరథం పట్టారు. ఓవర్సీస్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ సత్తో ఏంటో మరోసారి నిరూపించింది. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.

దేవర వసూళ్ళు కాస్త డల్ అయ్యాయి అనుకున్న సమయంలో దసరా పండుగ సెలవులకు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. దేవర మూవీ ఆదివారం సైతం అడ్వాన్స్ బుకింగ్ బాగానే నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వద్దకు క్యూ కట్టడంతో అదనపు వసూళ్లు నమోదు అయ్యాయి. దేవర మూవీలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్, ప్రముఖ నటుడు సయిఫ్ అలీఖాన్ ప్లస్ పాయింట్ గా నిలిచారు.

ఈ సినిమాను నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో యువసుధా ఆర్ట్స్‌ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు. ఎన్టీర్ నటించిన దేవర మూవీ రూ.500 కోట్ల క్లబ్ లో చేరడంతో నందమూరి అభిమానులు తెగ సంతోషంలో మునిగిపోతున్నారు. దేవర పార్ట్ 1 కి పాజిటీవ్ టాక్ వచ్చిన నేపథ్యంలో పార్ట్ 2 ని వచ్చే ఏడాదిలో మొదలు పెడతామని దర్శకులు కొరటాల శివ ఇటీవల ప్రకటించారు. ఈ మూవీకి అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişanadolucasino girişgrandpashabet